పొన్నూరులో కూటమి బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

పొన్నూరులో కూటమి బరితెగింపు

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

● వైఎస్సార్‌ సీపీ పొన్నూరు పట్టణ అధ్యక్షుడు, బీబీ జాన్‌ భర్త షేక్‌ నాజర్‌ మాట్లాడుతూ బీబీ జాన్‌ తరఫు న రెండు పేర్లతో వేర్వేరుగా దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించారన్నారు. 2016లో జీవనోపాధి కో సం పెట్టుకున్న హోటల్‌ను ఎమ్మెల్యే నరేంద్ర కూల్చి వేయించారని, తరువాత ప్రారంభించిన కేబుల్‌ వ్యాపారాన్ని అడ్డుకోవడంతో పాటు దాడులతో తమ కుటుంబంపై కక్ష గట్టారని అన్నారు. మైనార్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సైఫుల్లా మాట్లాడారు.

ఓడిపోతామనే

భయంతోనే

అక్రమాలు

వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని నామినేషన్‌ ఏకపక్షంగా తిరస్కరణ

టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతో అధికారుల ఇష్టారాజ్యం

పేరులో తప్పిదాన్ని సాకుగా చూపి రెండు సెట్లు తిరస్కరించిన అధికారులు

ముస్లిం మహిళ నామినేషన్‌ తిరస్కరించడం ద్వారా మైనార్టీలను అవమానించిన టీడీపీ

పొన్నూరులో అక్రమాలపై

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ

సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: పొన్నూరు మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ బీబీ జాన్‌ అలియాస్‌ సీమా కౌసర్‌ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ముస్లిం మైనార్టీ మహిళ పేరులో చిన్న తప్పిదాన్ని కారణంగా చూపిస్తూ రెండు సెట్ల నామినేషన్‌ను తిరస్కరించడం ద్వారా పోలీసులతో పాటు అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. మంగళవారం బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడారు. పొన్నూరు మున్సిపాల్టీకి జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థినిగా ముస్లిం మైనార్టీ మహిళకు తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశమిచ్చారని చెప్పారు. షేక్‌ బీబీ జాన్‌ అలియాస్‌ సీమా కౌసర్‌ తరఫున రెండు పేర్లతో వేర్వేరుగా దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారని చెప్పారు. అయితే తాము ముందుగానే పకడ్బందీగా ఓటరు కార్డు, ఆధార్‌, పాన్‌కార్డుతో పాటు విద్యావంతురాలైన సీమా కౌసర్‌కు సంబంధించిన ధ్రువపత్రాలను జత పర్చామన్నారు. అయినా రాజకీయ కోణంలో వైఎస్సార్‌ సీపీ తరఫున ముస్లిం సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళను అనర్హులుగా చేయాలనే దురుద్దేశంతో, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు దుష్ట పన్నాగం పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరులో మున్సిపాలిటీలో ముస్లిం ఓటర్లు 13 వేల మంది ఉండగా, ఎస్సీ ఓటర్లు 13వేలు బీసీ ఓటర్లు 16వేల మంది ఉన్నారని, వీరందరు వైఎస్సార్‌ సీపీకి ఓటు వేస్తారనే దుర్భుద్ధితో తమ అభ్య ర్థిని పోటీలో లేకుండా చేయాలని టీడీపీ నేతలతో కుమ్మకై ్కన అధికారులు రాజ్యాంగం ప్రకారం కాకుండా టీడీపీ నేతలు చెప్పిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని ఆరోపించారు. పొన్నూరు మున్సిపాల్టీలో వైఎస్సార్‌ సీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫామ్‌ ఇచ్చే అధికారం కలిగిన పార్టీ ప్రతినిధిగా జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన అధికారిక గుర్తింపు కలిగిన తన వివరణ చెప్పే అవకాశం సైతం ఇవ్వలేదన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా వినరా?

వైఎస్సార్‌ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చంద్రబాబు, ధూళిపాళ్ల నరేంద్ర చెప్పగలరా అని ప్రశ్నించారు?. అర్ధం లేని కారణాలను సాకుగా చూపించి నామినేషన్లు తిరస్కరించ వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని పోటీ చేసేందుకు అర్హత లేకుండా అడ్డుకోవడం ద్వారా టీడీపీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఉందని అర్ధమవుతోందన్నారు. గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరపున పోటీ చేసిన గెలుపొందిన 11 మంది కార్పొరేటర్లలో ఆరుగురు ముస్లిం అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. ముస్లింలు ఏకపక్షంగా వైఎస్సార్‌ సీపీ కి ఓటు వేస్తారనే భయంతో పేరును సాకుగా చూపి అడ్డుకున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement