తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థి, నటుడు అవసరాల శ్రీనివాస్ మంగళవారం సందడి చేశారు. ఇటీవల పూర్వ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల వేడుకకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయానని శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ తాను 1999లో కేఎల్‌యూలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరానని పేర్కొన్నారు. విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు అందించారు. తన విద్యాభ్యాసం, సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుభవాలు, ఎదురైన పరిస్థితులను పంచుకున్నారు. అనంతరం అప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ ప్రాంగణంలో సందడి చేశారు. వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ, ప్రో చాన్సలర్లు డాక్టర్ కేఎస్ జగన్నాథరావు, ప్రో వీసీలు డాక్టర్ ఎన్. వెంకట్‌రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ పవన్‌కుమార్, స్కిల్ డెవలప్‌మెంట్ డీన్ డాక్టర్ శ్రీనాథ్, ఆర్ అండ్ డీ డీన్ డాక్టర్ మాధవ్, పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ శ్రీకావ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సోని, డాక్టర్ హబీబుల్లా ఖాన్, లైఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ బుచ్చినాయుడు తదితరులు పాల్గొన్నారు.


