ఫిరంగిపురం: ఇంట్లో బంగారు నగలు చోరీకి గురైన సంఘటన మండల కేంద్రమైన ఫిరంగిపురంలోని కొత్తపేట కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పి.రాజేష్ తాపీ మేసీ్త్రగా పనిచేస్తుంటాడు. భార్య కూలీ పనులకు వెళుతుంటుంది. ఇంటి తాళం వేశాక బయట ఒకచోట తాళంచెవి పెడుతుంటారు. మధ్యాహ్నం పని నుంచి రాజేష్ భోజనానికి వచ్చాడు. అప్పటికే ఇంటి తలుపు తీసి ఉన్నాయి. బీరువాలో పెట్టిన 14 గ్రాముల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
14 గ్రాముల బంగారం చోరీ
Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM
14 గ్రాముల బంగారం చోరీ రెండు గుర్తుతెలియని
మృతదేహాలు లభ్యం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కృష్ణానది దిగువ ప్రాంతంలో నీటిలో తేలియాడుతూ మృతదేహాలు ఉన్నాయని మంగళవారం సాయంత్రం స్ధానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. స్పందించిన ఎస్‌ఐ ప్రదీప్ సంఘటనా స్ధలానికి వెళ్లి కృష్ణానది పుష్కరఘాట్‌ల వద్ద ఉన్న శివాలయం ఎదురుగా మృతదేహాన్ని వెలికితీయించారు. పుష్కర ఘాట్‌ల వద్ద రైల్వే వంతెన సమీపంలో ఉన్న మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. ఎటువంటి ఆధారాలు లభించలేదు. శివాలయం ఎదుట లభించిన మృతదేహంపై క్రీమ్ కలర్ పొడవు చేతుల చొక్కా, డార్క్ బ్రౌన్ కలర్ ఫ్యాంటు ఉన్నాయి. వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చు. రైల్వేట్రాక్ వద్ద లభించిన మృతదేహంపై నల్ల ప్యాంటు మాత్రమే ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వీరేంద్రబాబు (86888 31361), ఎస్. ప్రదీప్ (86888 31601)లను సంప్రదించాలని సూచించారు.
Advertisement


