ఆక్వాన్‌ను సమర్థంగా ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఆక్వాన్‌ను సమర్థంగా ఎదుర్కొందాం

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

గుంటూరు వెస్ట్‌: ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీర ప్రాంతాలకు తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ప్రజలు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. మంగళశారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ చైన్నె నుంచి కాకినాడ మధ్య తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆదివారం ఉదయం నుంచే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైందన్నారు. గత తుఫానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణ, ఆస్తి నష్టాలను వీలైనంతగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 20, 21 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ● భారీ వర్షాల సూచన నేపధ్యంలో ముందస్తు చర్యగా జిల్లాలో 74 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, వీటిలో సుమారు 10 వేలమందికి వసతి కల్పించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. ● తుఫాన్‌ ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు తక్షణమే తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ ప్రభావిత పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. జేసీ అశుతోష్‌ శ్రీ వాస్తవ, డీఆర్‌ఓ ఎన్‌ఎస్‌కె ఖాజావలి పాల్గొన్నారు.

జిల్లాలో 74 పునరావాస కేంద్రాలు.. సుమారు 10 వేల మందికి వసతి రైతులు పంట నష్ట నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

విద్యుత్‌ శాఖ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు

తుఫాన్‌ వేళ విద్యుత్‌ శాఖ అప్రమత్తం..

కొరిటెపాడు(గుంటూరు): ఆక్వాన్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి సుచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుంటూరు సర్కిల్‌ పరిధిలోని అధికారులతో మాట్లాడారు. విద్యుత్‌ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తుఫాన్‌ ప్రభావంతో భారీవర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్‌ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

గుంటూరు సర్కిల్‌ కంట్రోల్‌ రూమ్‌: 94408 17526

గుంటూరు డివిజన్‌

9440 17527

తెనాలి డివిజన్‌

94408 17535

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement