జిల్లా జైలు వద్దకు భారీగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైలు వద్దకు భారీగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

భద్రత నడుమ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని రాజమండ్రి తరలించిన పోలీసులు

నగరంపాలెం: అక్రమ కేసులో గుంటూరు జిల్లా జైలులో 12 రోజులుగా ఉన్న ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిని మంగళవారం రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి తరలించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి గుంటూరు జిల్లా జైలు వద్దకు తరలిరావడం ప్రారంభించారు. జైల్లో ఉన్న అప్పిరెడ్డిని చూసేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. రాత్రి ఏడున్నర తర్వాత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని జిల్లా జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు అప్పిరెడ్డి అభివాదం చేశారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు అళహరి శ్రీనివాస్‌ (ఎస్‌బీ), బెల్లం శ్రీనివాసరావు (గుంటూరు పశ్చిమ), పూర్ణచంద్రరావు (గుంటూరు దక్షిణ), సీఐలు, ఎస్‌ఐలు పెద్ద ఎత్తున పహారా నిర్వహించారు. డ్రోన్‌ సహాయంతో అక్కడ దృశ్యాలను చిత్రీకరించారు.

సాధారణ వాహనంలోనే...

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి తరలించేందుకు ముందుగా అనువైన వాహనాన్ని గుంటూరు జిల్లా జైలు ఎదుట నిలుపుదల చేశారు. అర్థంతంగా వాహనం నిలిచిపోవడంతో అక్కడ నుంచి ఆ వాహనాన్ని పోలీసులు వెనుక నుంచి నెట్టి ఖాళీ స్థలంలోకి నిలిపివేశారు. అనంతరం సాధారణ పోలీస్‌ వ్యాన్‌లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement