భక్తిశ్రద్ధలతో నాగుల చవితి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

గుంటూరులోని ఆర్‌టీఓ ఆఫీస్‌ వద్ద శ్రీనాగేంద్రస్వామి దేవస్థానంలో, ఆంజనేయపేట, పట్టాభిపురంలో, ఎస్పీ బంగ్లా వద్ద ఆలయాలలో శుక్రవారం నాగులచవితి సందర్భంగా భక్తులు నాగేంద్రుని పుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం వేకువజామున భక్తులు పూజలు చేశారు. నాగేంద్రునికి ఇష్టమైన నువ్వులపిండి, ఆవుపాలు, అరటిపండ్లు, చలిమిడి తదితర పదార్థాలను పుట్టలో వేసి దీపారాధనలు చేసి పూజలు నిర్వహించారు. పుట్టమట్టిని పిల్లల చెవులకు పెట్టి నాగేంద్రుని స్తోత్రాలను పఠించారు. పుట్టమట్టిని పెట్టుకోవడం వల్ల పిల్లలకు వచ్చే చెవికి సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా అర్చకులు నాగులచవితి విశిష్టతను వివరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement