నేడు ఎంటీఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఎంటీఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీలకు నోటిఫికేషన్‌

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

● 26న పోలింగ్‌... 30న ఓట్ల లెక్కింపు ● జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ (ఎంటీఎంసీ), పొన్నూరు పురపాలక సంఘాల ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నోటిఫికేషన్‌ శనివారం విడుదల చేస్తామని, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. 16వ తేదీ 3 గంటల వరకు గడువు ఉంటుందని తెలిపారు. 17న నామినేషన్ల పరిశీలన, 19న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన ఉంటుందన్నారు. 26వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికై తే వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించిందని చెప్పారు.

అల్పపీడనం పట్ల అప్రమత్తం

గుంటూరు వెస్ట్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ అధికారులు, ప్రజలకు సూచించారు. వాయవ్య దిశగా పయనించి శనివారం సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. తదుపరి ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఆర్‌.టి.జి.ఎస్‌ సూచనలు జారీ చేసిందని చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పంటలు నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement