తెనాలిరూరల్: బీటెక్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి ఇందిరానగర్ కాలనీకి చెందిన గాజులవర్తి రితిక(18) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించగా గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు యత్నించినట్టు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జెడ్పీ పాఠశాలలో డీఈఓ తనిఖీలు
Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM
జెడ్పీ పాఠశాలలో డీఈఓ తనిఖీలు ఫిరంగిపురం: మండలంలోని అల్లంవారిపాలెం జెడ్పీ పాఠశాలను బుధవారం డీఈఓ షేక్ సలీం బాషా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పరిశీలించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రికార్డులు పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతిపై తప్పనిసరిగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బోధన విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో–2 కమల్ ప్రసాద్, ఉపాధ్యాయులు ఉన్నారు. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Advertisement


