విద్యాభివృద్ధికి ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

విద్యాభివృద్ధికి ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం ఏఎన్‌యూలో దూరవిద్య పరీక్షలు ప్రారంభం పట్టాభి అవార్డుకు ఏఎన్‌యూ ఆచార్యుడు ఎంపిక దుర్గమ్మకు గాజుల అలంకారం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్‌ చక్రవర్తి

గుంటూరు లీగల్‌: భారతదేశంలో విద్యాభివృద్ధికి సమరయోధుడు, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చేసిన సేవలు చిరస్మరణీయం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. ఆజాద్‌ జయంతి వేడుకలను బుధవారం గుంటూరు జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌ హాలులో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్‌ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియావుద్దీన్‌ హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆజాద్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, అనంతరం భారత విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ బి.రేవతి, జనరల్‌ సెక్రటరీ వీరమనేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ షేక్‌ బాషా, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సిద్ధా సత్యనారాయణ, బేబీ ఝాన్సీ అడపా, లేడీ రిప్రజెంటివ్‌ అడపా ఇందిర, ట్రెజరర్‌ ఆకుల సుజాత, స్పోర్ట్స్‌ సెక్రటరీ హనుమంతరావు, లేడీ ఎగ్జిక్యూటివ్‌ లక్ష్మీ తిరుపతమ్మ, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ నీలగిరి రాజు, మాజీ ఏజీపీ అబ్దుల్‌ ఫరూక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో పీజీ, యూజీ, డిప్లమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రాం పరీక్షలు బుధవారం ప్రారంభమైనట్లు దూర విద్యా కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్‌ ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌ తెలిపారు. పరీక్షలు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రంలో 428 మందికి 310 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. వర్సిటీలో పరీక్ష కేంద్రాన్ని దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్‌ ఆచార్య రామచంద్రన్‌, పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ పద్మావతి సందర్శించారు. పరీక్షలు జరిగే తీరును పరిశీలించారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): జాతీయస్థాయి పట్టాభి అవార్డుకు ఏఎన్‌యూ పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్‌ బ్రహ్మాజీరావు ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం గుంటూరులోని డాక్టర్‌ పట్టాభి కళాపీఠం ప్రతిష్ఠాత్మకంగా అందించే జాతీయస్థాయి పట్టాభి అవార్డుకు పి. బ్రహ్మాజీరావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ తూములూరి రాజేంద్రప్రసాద్‌ ఎంపిక లేఖను ఆయనకు పంపారు. ఈ నెల 14న గుంటూరులో జరిగే పట్టాభి కళాపీఠం 16వ వార్షికోత్సవంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. పర్యావరణ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఆచార్య బ్రహ్మాజీరావును వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర ఉద్యోగులు, పరిశోధకులు అభినందించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక శుద్ధ విదియ (భగిని హస్త భోజనం), యమ ద్వితీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారికి గాజుల ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణం, ఉపాలయాలు, నూతన పూజా మండపంలోని ఉత్సవమూర్తిని గాజులతో విశేషంగా అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement