న్యూస్‌రీల్
చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు తమటం నాగేశ్వరరావు. వయస్సు ఏడు పదులపై మాటే. వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. 3.20 ఎకరాల్లో మిర్చి, ఎకరాలో మొక్కజొన్న, 8 ఎకరాల్లో వరి సాగు చేశారు. మిర్చికి ఎకరాకు సుమారు రూ.40 వేలు, వరికి ఎకరాకు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు తెచ్చారు. మురసు తుపాను దెబ్బకు మిరప పైరు తుడిచిపెట్టుకుపోయింది. రూ.2.50 లక్షల నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధమవుతున్న వరిని కాపాడుకునే పనిలో ఉన్నారు. మొక్కజొన్నకు కూడా ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అదీ నీట మునిగింది. దాదాపు రూ.3.50 లక్షల నష్టం వచ్చింది. మళ్లీ మిర్చి సాగుకు సిద్ధమవుతున్నారు.


