గండాలయ స్వామికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

గండాలయ స్వామికి విశేష పూజలు

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

గండాలయ స్వామికి విశేష పూజలు తాడేపల్లి రూరల్‌: అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి కొండపై కొలువైన గండాలయ స్వామికి భక్తులు ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళగిరితోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి తరలివచ్చారు. దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున గండాలయ స్వామికి దీపాలు వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ప్రతి అమావాస్యకు కొండపై గండాలయ స్వామి సన్నిధికి చేరుకుంటారు. దీపాలు వెలిగించడం వల్ల చీకటిని పోగొట్టి వెలుగునిచ్చి జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మంగళగిరి కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మాల ధరించిన అయ్యప్పస్వామి భక్తులు అధిక సంఖ్యలో దీపాలు వెలిగించారు. దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలోని దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ, యూజీ, డిప్లమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రాం పరీక్షలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దూర విద్యా కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్‌ ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఈనెల 20 తేదీ వరకు కొనసాగుతాయన్నారు. యూజీ 5వ సెమిస్టర్‌, పీజీ 4వ సెమిస్టర్‌, అన్ని రకాల డిప్లొమా, సర్టిఫికెట్‌, బీఎల్‌ఐసి, ఎంఎల్‌ఐసీ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని, 1 సెషన్‌ మాత్రమే పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. దాదాపు 13,700 మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కేంద్రంలో దాదాపు 500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇప్పటికే హాల్‌ టికెట్లను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని దిట్టకవి రామచంద్రన్‌ తెలియజేశారు. నంద్యాల–గాజులపల్లి డబుల్‌ లైన్‌ ప్రారంభం కార్తిక మాసోత్సవాలు ప్రారంభం

లక్ష్మీపురం: ప్రాంతీయ రైలు అనుసంధానానికి, సరుకు రవాణాకు ఒక పెద్ద ప్రోత్సాహంగా, దక్షిణ కోస్తా రైల్వే నంద్యాల–గాజులపల్లి మధ్య ఉన్న 15.121 కిలోమీటర్ల డబుల్‌ లైన్‌ను ఈనెల 6న విజయవంతంగా ప్రారంభించినట్లు గుంటూరు రైల్వే డివిజన్‌ డీసీఎం, డివిజన్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి జీవీఎస్‌ భరత్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలకు అనుమతించినట్లు తెలిపారు. ఈ మార్గం గుంటూరు–గుంతకల్‌ డబ్లింగ్‌ ప్రాజెక్ట్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గాజులపల్లి నందిపల్లిలో ఆధునిక స్టేషన్‌ భవనాలు నిర్మించినట్లు తెలిపారు. నందిపల్లి వద్ద సరుకుల ఎగుమతి, దిగుమతికి ప్రత్యేకంగా కొత్త ప్లాట్‌ఫారం కేటాయించారని తెలిపారు. నంద్యాల–గాజులపల్లి సెక్షన్‌ ప్రారంభంతో గుంటూరు–గుంతకల్‌ కారిడార్‌ పొడవునా ప్రయాణికుల సౌకర్యాన్ని, సరుకు రవాణా సామర్‌ాధ్యన్ని బలోపేతం చేస్తుందని తెలియజేశారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయంలో సోమవారం కార్తిక మాసోత్సవాలు ఆరంభమయ్యాయి. మల్లేశ్వరాలయం, నటరాజస్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపాలను వెలగించారు. తొలుత మల్లేశ్వరాలయం ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్‌లచే ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ పూజా కార్యక్రమాలను జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement