వైఎస్సార్‌ సీపీ నాయకులపై పచ్చమూక దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నాయకులపై పచ్చమూక దాడి

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

చేబ్రోలు: పరిషత్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి ఓట్ల లెక్కింపులో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎంపీటీసీగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి టీడీపీ అభ్యర్థి రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించుకోవడమే కాకుండా గ్రామంలోకి వచ్చి ర్యాలీ పేరుతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటన చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెంలో జరిగింది. పచ్చమూక దాడిలో ఐదుగురికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని వీరనాయకునిపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. శేకూరు–2 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ తరఫున యర్రాకుల వెంకటరాజు పోటీ చేశారు. నామినేషన్ల స్వీకరణ దగ్గర నుంచి స్క్రూటినీలో నామినేషన్‌ తిరస్కరింపచేయటానికి టీడీపీ నాయకులు విశ్వప్రయత్నం చేశారు. ఆ కుట్రలు విఫలం కావటంతో ఓట్ల లెక్కింపులో కుట్రలకు తెరతీశారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పది ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. రీ కౌంటింగ్‌లోను వెంకటరాజుకు మెజార్టీ వ చ్చింది. అయినప్పటికీ అధికారపార్టీ నాయకుల తీవ్రమైన ఒత్తిళ్లకు ఎన్నికల అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించారు.

విజయోత్సవ ర్యాలీ పేరుతో దాడి

ఎన్నికలలో అక్రమంగా గెలుపొందినట్లు ప్రకటించుకున్న అధికార పార్టీ నాయకులు ఎంపీటీసీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీని గ్రామంలో నిర్వహించారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఇళ్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యర్రాకుల శివనాగేశ్వరరావు తలకు, చేతులకు బలమైన గాయాల య్యాయి. వీరితో పాటు, శ్రీనివాసు, వెంకటేశ్వర మ్మ, సత్యవతిలకు సైతం గాయాలయ్యాయి. వీరు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

వైఎస్సార్‌ సీపీకి చెందిన 8 మందిపై కేసులు..

అయితే టీడీపీ నేత శివగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వై.శివకృష్ణ మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.వీరనారాయణ తెలపడం పచ్చపాతాన్ని తేటతెల్లం చేస్తోంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన నలుగురికి తీవ్ర గాయాలైనప్పటికీ ఎవరిపైనా ఎటువంటి కేసులు నమోదు చేయకపోవటం గమనార్హం.

పచ్చమూక దాడిలో గాయపడిన వ్యక్తి

మహిళ అనికూడా చూడకుండా దాడి..

వీరనాయకునిపాలెంలో

నలుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement