చెస్‌ టోర్నమెంట్‌కు ఏఎన్‌యూ జట్టు | - | Sakshi
Sakshi News home page

చెస్‌ టోర్నమెంట్‌కు ఏఎన్‌యూ జట్టు

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

గుంటూరు రూరల్‌: నగర శివారుల్లోని లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాల పురుషుల చెస్‌ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి ఆరుగురు క్రీడాకారులు దక్షిణ భారత స్థాయి చెస్‌ టోర్నమెంట్‌లో ఏఎన్‌యూ తరుఫున పాల్గొని ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ వడ్లమూడి పల్లవి తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఏఎన్‌యూ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి ఎంపికై న ప్రతిభావంతులైన క్రీడాకారులతో కూడిన జట్టు ఈ పోటీల్లో పాల్గొని ఏఎన్‌యూకి ప్రాతినిధ్యం వహించడం విశేషమన్నారు. జట్టుకు హర్షిత్‌ వర్ధన్‌ గెదెల(జేసీ కళాశాల), ఆర్‌.వి.ఆర్‌.అండ్‌ జె.సి.కళాశాలకు చెందిన ఇస్మాయిల్‌ ఎం.డి పవనకృష్ణ, ప్రసాద్‌, జి.అంజనికుమార్‌రెడ్డి, అభినయ్‌ ఎంపికయ్యారని తెలిపారు. జట్టుకు టీమ్‌ మేనేజర్‌గా చలపతి ఫార్మసీ కళాశాలకు చెందిన ఫీజికల్‌ డైరెక్టర్‌ పి.భానుప్రకాష్‌ వ్యవహరించనున్నారని తెలిపారు. చలపతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ వై.వి.ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్‌ క్రీడాకారులను అభినందించారు.

ఏపీ మెగా హ్యాకథాన్‌లో విజ్ఞాన్‌ నిరుల విద్యార్థినులకు ప్రథమ బహుమతి

రూ.2 లక్షల నగదు పురస్కారం

గుంటూరు రూరల్‌: టాలెంట్‌ ఏపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని సంగివలస అనిల్‌ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాలలో ఇటీవల నిర్వహించిన టాలెంట్‌ ఏపీ మెగా హ్యాకథాన్‌ 2026లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించారని విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ రాధిక తెలిపారు. శనివారం పెద్దపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతితోపాటు రూ.2 లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఏడు వేలకి పైగా రిజిస్ట్రేషన్లు నమోదైన ఈ హ్యాకథాన్‌లో, ఏఐ ఆధారిత షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా 140కి పైగా బృందాలు ఆఫ్‌లైన్‌ పోటీలకు ఎంపికయ్యాయని తెలిపారు. బృందంలో మందపాటి లాస్య, పరాంకుశం మైత్రేయి, పురమా నందినిలక్ష్మి, అవుల హేమ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. విజ్ఞాన్‌ నిరులా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య విజేతలను అభినందించారు. విజయంపై వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్‌ వి.లక్ష్మణ్‌నారాయణ, డాక్టర్‌ ఎ.పెదగోపి, డాక్టర్‌ కె.సత్యసందీప్‌ తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement