డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీ ముట్టడి

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

లక్ష్మీపురం: కార్మికుల వేతనాలు పెంచాలని, కార్మిక హక్కులను హరించే లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఢిల్లీ ముట్టడిని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం పాత గుంటూరులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌ కోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేస్తూ నిర్వహిస్తున్న ఢిల్లీ ముట్టడి కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.లక్ష్మణరావు, దండా లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కె. శ్రీనివాసరావు, షేక్‌ హుస్సేన్‌ వలి, జిల్లా కార్యదర్శులు జి.రమణ, బి.ముత్యాలరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement