లక్ష్మీపురం: ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసగా మారి ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై అరండల్‌పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. అభ్యుదయనగర్‌కు చెందిన జనమాల మహేష్(36) ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. అప్పులు చేస్తూ మానసికంగా బాధపడుతూ ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దింపి చూసే సరికి అప్పటికే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అరండల్‌పేట పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని మృతి చెందిన వైనాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాసుపత్రికి పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య కస్తూరి ఒక పాప, బాబు ఉన్నారు.


