న్యూస్‌రీల్
పకడ్బందీగా ఏర్పాట్లు
పులిచింతల సమాచారం
గుంటూరు
శనివారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2026
● ఉదయం 8 గంటలకు
కౌంటింగ్ ప్రారంభం
● ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని
జిల్లా కలెక్టర్ వెల్లడి
● పోలింగ్‌లో చిన్న ఘటనలు మినహా
ఇబ్బందులు లేవని ప్రకటన
పెదకాకాని: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం 8 గంటలకు ప్రారంభం అవుతుందని జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు తెలిపారు. గుంటూరు రెవెన్యూ డివిజన్‌లోని పెదకాకాని, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలం, మేడికొండూరు, ఫిరంగిపురం, పెదనందిపాడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు పోటీలో ఉన్న అభ్యర్ధులతో పాటు ఏజెంట్‌లను కూడా కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తామన్నారు. పెదకాకాని మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన 19 ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ అభ్యర్థికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు శనివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఏఎన్‌యూలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అవసరమైన టేబుళ్లు, ప్లాస్టిక్ టబ్‌లు, కంప్యూటర్‌లు సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఎంపీడీఓ ఆర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ పి.కృష్ణకాంత్, ఈఓపీఆర్‌డీ కెల్లంపల్లి శ్రీనివాస్, పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తదితరులు పరిశీలించారు.
పోలింగ్ సజావుగా పూర్తి
గుంటూరు వెస్ట్: తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ గురువారం జిల్లాలో జరిగిన 13 జెడ్పీటీసీ, 193 ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువమంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కల్టెరేట్‌లోని వీసీ హాల్లో ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 724 కేంద్రాల్లో 5,88,458 ఓటర్లకుగాను 4,30,286 మంది ఓటు వేశారన్నారు. 73.12 శాతం ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. గుంటూరు రూరల్ మండలం వెంటళాయపాలెం ఎంపీటీసీ పోలింగ్ కేంద్రానికి సంబంధించి చల్లావారిపాలెంలో చిన్న శాంతిభద్రతల సమస్య తలెత్తిందని చెప్పారు. దానిని మాట్లాడి పరిష్కరించామని తెలిపారు. ఫిర్యాదులు వస్తే విచారణ చేపడతామని పేర్కొన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జ్
ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ... పటిష్టంగా పోలింగ్ నిర్వహించామన్నారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది వెంగళాయపాలెం నుంచి బ్యాలెట్ బాక్స్‌లను రిసెప్షన్ కేంద్రానికి తీసుకెళుతున్న సమయంలో చల్లావారిపాలెం సమీపంలోని పోలింగ్ అధికారి బస్సులో రద్దీగా ఉందని దిగిపోయారన్నారు. మరో బస్సు ఎక్కిన క్రమంలో అప్పటికే ఫాలో అవుతున్న కొంతమంది.. బ్యాలెట్ బాక్స్‌లు మార్చేస్తారని అపార్థానికి లోనై నిరసన తెలిపారన్నారు. ఒక్కసారిగా 200 మంది బస్సుకు అడ్డంగా కూర్చున్నారన్నారు. గంటన్నర వరకు నిరసనకారులతో మాట్లాడి బ్యాలెట్ బాక్స్‌లకు ఎటువంటి ఇబ్బంది లేదని ఎంత చెప్పినా ధర్నా చేశారన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిపై లాఠీచార్జ్ చేశామని తెలిపారు. తర్వాత ఇబ్బందులు లేకుండా బ్యాలెట్ బాక్స్‌లను రిసెప్షన్ సెంటర్‌కు చేర్చామన్నారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తామని ఎస్పీ వెల్లడించారు.
గుంటూరు వెస్ట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుపై శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలానికి సంబంధించి రెండు ఓట్ల లెక్కింపు గదులను ఏర్పాటు చేశామని చెప్పారు. సిబ్బంది సకాలంలో చేరుకోవాలన్నారు. గుంటూరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ, తెనాలి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి వీఎస్‌ఆర్ కళాశాలలోనూ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్‌వో ఎన్.ఎస్.కె. ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాస రావు, కె.శ్రీరమణి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.3537 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.


