ఎర్రవాగుకు తగ్గని వరద ఉధృతి | - | Sakshi
Sakshi News home page

ఎర్రవాగుకు తగ్గని వరద ఉధృతి

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

కొండవీటి వాగు వరద నీటితో నిండిన తాడికొండ– కంతేరు రహదారి నాలుగు రోజులుగా ప్రయాణికులకు తప్పని అవస్థలు

తాడికొండ: కొండవీటి వాగు వరద ఉధృతి కట్టలు తెంచుకొని పంట పొలాలపై పడటంతో తాడికొండ మండలం కంతేరు గ్రామంలోని ఎర్రవాగు పొంగి పొర్లుతుండటంతో రోడ్డు పొడవునా నీరు ఏరులై పారుతుంది. దీంతో గత నాలుగు రోజులుగా తాడికొండ నుంచి కంతేరు మీదుగా మంగళగిరి, విజయవాడ వెళ్ళాల్సిన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కొండవీటి వాగు ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ.వేల కోట్లు రాజధానికే పరిమితం కావడంతో ఎగువన ఉన్న కొండవీటి వాగుపై కనీస మరమ్మతులు లేక కట్టలు బలహీనమై పంట పొలాలపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగు రోజులైన వరద ఉధృతి తగ్గకపోవడంతోపాటు రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి నెలకొనడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు అవస్థలు తప్పేలా లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement