నేతన్నలను సత్వరం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నేతన్నలను సత్వరం ఆదుకోవాలి

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

చేనేత కుటుంబాలకు 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలి నేతన్న సేవా పథకం రెండో విడత రూ.25 వేలు వెంటనే జమ చేయాలి ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ

మంగళగిరి టౌన్‌: తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీవర్షాల కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా మగ్గాల గుంటల్లోకి నీరు చేరడంతో చేనేత కార్మికులు పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో అనేక చేనేత కుటుంబాలు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో చేనేత కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇదే తరహాలో తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులందరికీ 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నేతన్న సేవా పథకం రెండో విడత కింద 31 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆగస్టు 30 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. గడువు దాటి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు నగదు జమ కాలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులందరి ఖాతాల్లో రూ.25 వేలు జమ చేయాలని బాలకృష్ణ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement