హత్య కేసులో న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో న్యాయం చేయండి

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

దళిత సంఘం నేతలు, మహిళల ధర్నా

చేబ్రోలు: గత ఏడాది చేబ్రోలు మండలం నారాకోడూరు దళితవాడ ప్రాంతానికి చెందిన యువకుడు హత్య కేసు సంఘటనకు సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం స్థానిక మహిళలు, యువకులు రాస్తారోకో నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్‌ నెలలో నత్తల మృత్యుంజయరావు డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనకు బాద్యులైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్కాపురం, ఇతర ప్రాంతాల్లో నిందితులు ఉంటున్నారు. హత్య కేసులోని నిందితులు దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో పరిషత్‌ ఎన్నికల కేంద్రానికి వచ్చి ఓటు వేయటం, వెళ్లే సమయంలో రెచ్చగొట్టే విథంగా ప్రవర్తించటంపై స్థానిక మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నారాకోడూరులోని తెనాలి రోడ్డులో మృతుడి భార్య నత్తల లత భర్త ఫొటో పెట్టుకొని బంధువులు, స్థానికులతో కలిసి రాస్తారోకో చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు విషయం తెలుసుకొని సంఘటనా ప్రాంతానికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు, యువకులతో మాట్లాడి వారిని శాంతింప చేసి రాస్తారోకోను విరమింపచేశారు. దీంతో తెనాలి, నారాకోడూరు వైపు బారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. నిరసన వ్యక్తం చేస్తున్న వారితో ఎస్‌ఐ పి.వీరనారాయణ, ఇరువురు ిసీఐలు మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రాస్తారోకోను విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement