రైతులకు నష్టపరిహారం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

తాడేపల్లి రూరల్‌: మురసు తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయినరైతులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకర్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం తాడేపల్లి రూరల్‌ ఉండవల్లి గ్రామంలో నాయకులతో కలసి ఆయనపర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరటితోట పూర్తిగా నేలకు ఒరిగిందని అన్నారు. మురసు తుఫాన్‌ తీవ్రంగా రైతులకు నష్టం కలిగించిందన్నారు. ఎకరా అరటితోటకు కౌలుతో కలిపి రూ.లక్ష పెట్టుబడి అవుతోందని, తుఫాన్‌ కారణంగా నేలకొరిగిందని, మార్కెట్‌ సరిగ్గా లేదని, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ప్రతి రైతుకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం నాయకులు ఈశ్వర్‌ రెడ్డి, రైతులు దాసరి నాగరాజు, అంజయ్య, శంకర్‌,కళ్ళం వెంకట రెడ్డి, మున్నంగి స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

జొన్న శివశంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement