సుస్థిర ఆహార వ్యవస్థలను అవలంబించాలి | - | Sakshi
Sakshi News home page

సుస్థిర ఆహార వ్యవస్థలను అవలంబించాలి

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

గుంటూరు మెడికల్‌: బీఆర్‌ఐసీఎస్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు ఆధ్వర్యంలో ‘సుస్థిర ఆహార వ్యవస్థలను అవలంభించండి’ అనే అంశంపై గుంటూరు ఇండియన్‌ టుబాకో గుంటూరులో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్‌ ఎం.డి. నజీనా బేగం మాట్లాడుతూ సుస్థిర ఆహార వ్యవస్థలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆహారాన్ని అవసరమైన మేరకే తీసుకోవాలన్నారు. ఆహారాన్ని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను చెత్తలో పడేయకుండా వాటిని శాసీ్త్రయ పద్ధతుల్లో కంపోస్టింగ్‌ ద్వారా సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని వివరించారు. నీటి వృథాను తగ్గించడం, స్థానికంగా, సీజనల్‌గా లభించే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరమని చెప్పారు. మానవతా ఫౌండేషన్‌ చైర్మన్‌ వీరారెడ్డి, ఐటీసీ టుబాకో బోర్డు మేనేజర్‌ సురేఖ, మానవతా ఫౌండేషన్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ కల్పన, టుబాకోబోర్డు పర్యావరణ సమన్వయకర్త డి.తిరుపతిరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, సుమారు 700 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement