సజావుగా ఎన్నికల ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

సజావుగా ఎన్నికల ప్రక్రియ

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

ఫిరంగిపురం: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికలు సజావుగా సాగేలా సిబ్బంది విధులు నిర్వహించాలని జేసీ అశుతోష్‌ శ్రీవాత్సవ అన్నారు. స్థానిక మండల కేంద్రంలోని కొండవీటి ఫంక్షన్‌ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఎన్నికల విధులు సక్రమంగా వ్యవహరించాలని చెప్పారు. పలు అంశాలపై వారికి తగిన సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల సామగ్రి అందజేశారు. ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మండలంలోని 18 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామాల్లో 60 బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధప్రాంతాల నుంచి 432 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి కె.మయూరి, పంచాయతీ అధికారి సాయికుమార్‌, తహసీల్దార్‌ జె.ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement