సాక్షి ఫొటోగ్రాఫర్‌పై దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్‌పై దౌర్జన్యం

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

సాక్షి ఫొటోగ్రాఫర్‌పై దౌర్జన్యం పోలీసుల అదుపులో అనుమానితుడు

లక్ష్మీపురం: గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ వద్ద ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి ఫొటోగ్రాఫర్‌ రామ్‌గోపాల్‌ ఫొటోలు తీస్తుండగా టీడీపీ మూకలు ఫొటోలు తీయకుండా అడ్డుగించి దౌర్జన్యానికి దిగారు. బూత్‌ వద్ద ఫొటోలు తీస్తే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు దిగారు.

ఉదయగిరి రూరల్‌: ఉదయగిరి దుర్గం కొండపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పర్యాటకులు గమనించి పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని జి.అయ్యవారిపల్లెకు చెందిన ఆరుగురు యువకులు దుర్గం కొండ చూసేందుకు వెళ్లారు. ఈ తరుణంలో కొండపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతుండగా గుప్తనిధుల కోసం వచ్చారేమోనని వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో రామస్వామి అనే వ్యక్తి పరారుకాగా గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన శామ్యూల్‌ అనే వ్యక్తిని యువకులు పట్టుకొని దుర్గం కొండపై నుంచి కిందకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement