చట్టాలపై న్యాయవాదుల నవీకరణ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై న్యాయవాదుల నవీకరణ తప్పనిసరి

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

చట్టాలపై న్యాయవాదుల నవీకరణ తప్పనిసరి

తెనాలి: న్యాయవాదులు చట్టపరిధిలో తగిన వాదనలు చేయగలిగితే మంచి తీర్పులు వస్తాయని మచిలీపట్నం అదనపు జిల్లా జడ్జి తోక రాజా వెంకటాద్రి చెప్పారు. ఇందుకు న్యాయవాదులు కూడా ఏరోజు కారోజు ఉన్నత న్యాయస్థానాల తీర్పులతో అప్‌డేట్‌ అవుతుంటే వృత్తిలో రాణించటానికి అవకాశం ఉంటుందన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి హోదాలో ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన తెనాలికి చెందిన వేల్పుల కృష్ణమూర్తి కవిరాజ పార్కు రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన న్యాయసలహా కేంద్రాన్ని శనివారం రాజా వెంకటాద్రి ప్రారంభించారు. తెనాలిలో 15 ఏళ్లు న్యాయవాదిగా, 30 ఏళ్లపాటు న్యాయమూర్తిగా వివిధ ప్రదేశాల్లో సేవల నందించిన కృష్ణమూర్తి న్యాయసలహా కేంద్రం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా వృత్తిలోకి వచ్చినవారు, జూనియర్‌ న్యాయవాదులు కృష్ణమూర్తి సలహాలను తీసుకుని వృద్ధిలోకి రావాలని సూచించారు. విశ్రాంత న్యాయమూర్తి వేల్పుల కృష్ణమూర్తి తన ప్రసంగంలో కాలానుగుణంగా మారుతుండే న్యాయచట్టాలు, తీర్పులకు తగినట్టుగా న్యాయవాదులు అప్‌డేట్‌ అవుతుండాలని అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకొని న్యాయవాద వృత్తిలో నైపుణ్యానికి, కక్షిదారులకు తగిన సలహాలు ఇవ్వాలన్న భావనతో సేవాదృక్పథంతో న్యాయసలహా కేంద్రాన్ని ఆరంభించినట్టు తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదనపు జిల్లా జడ్జి రాజా వెంకటాద్రి, ఆయన కుమారుడు, హైకోర్టు న్యాయవాది కులదీప్‌ రచించిన ‘ఏ గ్లింప్స్‌ ఇన్‌టు ద క్రిమినల్‌ మేజర్‌ యాక్ట్స్‌’ పుస్తకాన్ని సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.రామారావు, జగదీశ్వరాంబకు బహూకరించారు. కార్యక్రమంలో విశ్రాంత అదనపు ఎస్పీ తాడిబోయిన రామకృష్ణ, న్యాయవాదులు దరిశి శివకోటేశ్వరరావు, మేకా మురళీకృష్ణ, జెస్సీపాల్‌, చందోలు డేవిడ్‌ విజయకుమార్‌, గుమ్మడి రవిరాజ్‌, రాజ్యలక్ష్మి, శ్యామల, పద్మ, శారద, శ్రుతి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (సీబీఐ) బట్టా శ్రీనివాసరావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, తాడిబోయిన బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

న్యాయసలహా కేంద్రం ప్రారంభ సభలో అదనపు జిల్లా జడ్జి రాజా వెంకటాద్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement