చేబ్రోలు: శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి, దేశ ప్రగతికి విశేష సేవలందిస్తున్న విజ్ఞాన్ యూనివర్సిటీ చాన్స్‌లర్ పావులూరి సుబ్బారావుకు ప్రతిష్టాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, విద్యా, పరిశోధన రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ, అకడమిక్ నాయకత్వంలో ప్రతిభ కనబరుస్తున్న సీఈఓ డాక్టర్ కూరపాటి మేఘనకు ఎక్సలెంట్ అకడమిషియన్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌జీఆర్‌ఐ)లో నిర్వహించిన సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అకాడమీ(ఏఎస్‌టీసీ) వార్షిక సదస్సు– 2026 సందర్భంగా ఈ పురస్కారాలను అందజేశారు. ఎర్త్ సైన్సెస్, వ్యూహాత్మక వనరులు, భారతదేశ భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై నిర్వహించిన ప్రత్యేక శాసీ్త్రయ సదస్సులో భాగంగా అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అంతరిక్ష, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి డాక్టర్ పావులూరి సుబ్బారావు అందిస్తున్న విశేష సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు గుర్తిస్తూ కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ తుమ్మల శ్రీనివాస కుమార్ ఈ ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. విద్యారంగంలో నాణ్యమైన విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం, ఉన్నత విద్యారంగంలో నూతన ప్రమాణాలను నెలకొల్పడంలో విజ్ఞాన్ సీఈవో డాక్టర్ కూరపాటి మేఘన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆమెకు ఎక్సలెంట్ అకడమిషియన్ అవార్డుతో సత్కరించారు. వీరిని వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ శనివారం అభినందనలు తెలిపారు.


