ఏఎన్‌యూలో ముగిసిన వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూలో ముగిసిన వర్క్‌షాప్‌

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలోని నృత్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రుతి మాతా, లయ, పిత – సంగీతం, లయ, నృత్యాల సమగ్ర అధ్యయనంపై ఒకరోజు అకడమిక్‌ వర్క్‌షాప్‌ ముగిసింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సంగీతం, లయ, నృత్యాల మధ్య ఉన్న అంతర్లీన సంబంధాలను వివరించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఇన్‌చార్జి వీపీ ఆచార్య కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెక్టార్‌ ఆర్‌.శివరామ్‌ ప్రసాద్‌ ప్రోత్సాహాన్ని అందించారు. వర్క్‌షాప్‌నకు వనరుల వ్యక్తులుగా మధురైలోని శ్రీసద్గురు సంగీత విద్యాలయం వీణ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.శంకరనారాయణన్‌, అదే సంస్థ గాత్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.కమల కన్నన్‌ హాజరయ్యారు. వీరు శ్రుతి, స్వర, తాళ, లయ అంశాల ప్రాధాన్యతను వివరిస్తూ, శాసీ్త్రయ సంగీతం, భరతనాట్యం వంటి ప్రదర్శన కళల్లో సంగీత పరిజ్ఞానం, లయబద్ధత, భావవ్యక్తీకరణల ప్రాముఖ్యతను తమ అనుభవాల ద్వారా వివరించారు. వర్క్‌షాప్‌ డైరెక్టర్‌, నృత్య విభాగాధిపతి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ పి.వరప్రసాదమూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రోగ్రాం కన్వీనర్‌ ఎంవీ విశ్వనాధ్‌, కో–కన్వీనర్‌ ఎం.కాశయ్య కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement