సమాజానికి రామాయణం మార్గదర్శకం | - | Sakshi
Sakshi News home page

సమాజానికి రామాయణం మార్గదర్శకం

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

నగరంపాలెం: మహర్షి వాల్మీకి రచించిన రామాయణం సమాజానికి మార్గదర్శకమని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ అన్నారు. సోమవారం ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితంలో ఎన్నో మార్పులను అధిగమించారని అన్నారు. అత్యున్నతమైన రామాయణ మహాకావ్యాన్ని రచించి ఆదికవిగా కీర్తి గడించారని పేర్కొన్నారు. రామాయణం తరతరాలకు ధర్మం, నీతి, మానవీయ విలువలను బోధిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాల న) జీవీ.రమణమూర్తి, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, కృష్ణయ్య, సురేష్‌, డీపీఓ ఏఓ సులోచన తదితరులు నివాళులర్పించారు.

ఆర్వో తొలగింపు?

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 2, 3, 4 వార్డులకు కేటాయించి ఆర్వో(రిటర్నింగ్‌ ఆఫీసర్‌) ప్రభాకరరావు గంగాధరి(అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌)ను తప్పిస్తూ నగర కమిషనర్‌, అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ మయూర్‌ అశోక్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పై వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో తప్పులు దొర్లడంతో పాటు, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకుగాను ప్రభాకరరావుకు షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతోపాటు ఆయనపై చర్యలు తీసుకునేందుకు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌ సిఫార్సు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement