● బెంగళూరు పోలీసులుమంటూ బెదిరింపు కాల్స్‌ ● అకౌంట్‌లో పొరపాటున డబ్బులు పడ్డాయంటూ నమ్మబలికిన వైనం ● బాధిత రిటైర్డ్‌ ఉద్యోగి ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసుల దర్యాప్తు | - | Sakshi
Sakshi News home page

● బెంగళూరు పోలీసులుమంటూ బెదిరింపు కాల్స్‌ ● అకౌంట్‌లో పొరపాటున డబ్బులు పడ్డాయంటూ నమ్మబలికిన వైనం ● బాధిత రిటైర్డ్‌ ఉద్యోగి ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసుల దర్యాప్తు

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

● బెంగళూరు పోలీసులుమంటూ బెదిరింపు కాల్స్‌ ● అకౌంట్‌లో పొరపాటున డబ్బులు పడ్డాయంటూ నమ్మబలికిన వైనం ● బాధిత రిటైర్డ్‌ ఉద్యోగి ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసుల దర్యాప్తు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కృష్ణానదిలో మునిగి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో నివాసముండే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కృష్ణానది నీటిలో మునిగి మృతి చెందాడు. తాడేపల్లి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ప్రదీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరానికి చెందిన గాడి అజయ్‌కుమార్‌ (47) పదేళ్లుగా మతిస్థిమితం లేదు. ఇంటివద్దనే ఉంటూ అప్పుడప్పుడు ఇల్లు వదిలి వెళ్లి తిరిగి వస్తుంటాడు. ఈనెల 21వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య రమాదేవితోపాటు అతని ఇద్దరు పిల్లలు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. కృష్ణానది దిగువ ప్రాంతం పుష్కరఘాట్‌లో మృతదేహం ఉందని స్థానిక మత్స్యకారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లారు. మృతుడిని అజయ్‌కుమార్‌గా గుర్తించి భార్య రమాదేవికి సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్‌ ఇల్లు విడిచి వెళ్లిపోతుంటాడని, అదే విధంగా మరలా వెళ్లి ఉంటాడని అనుకుని కుటుంబ సభ్యులు ముందుగా ఫిర్యాదు చేయలేదని ప్రదీప్‌ తెలిపారు. రిటైర్డ్‌ ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.10 లక్షలు మోసం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 15 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా వట్టిచెరుకూరు మండలంలో 24.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో ఒక మి.మీ. వర్షం పడింది. సగటున 7.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు మండలంలో 20.4 మి.మీ., దుగ్గిరాల 16.6, గుంటూరు తూర్పు 16.2, చేబ్రోలు 13, పెదనందిపాడు 9.2, తెనాలి 7.8, కాకుమాను 6.8, తాడికొండ 4.8, పెదకాకాని 4, కొల్లిపర 3.6, తాడేపల్లి 1.6, గుంటూరు పశ్చిమ 1.3, తుళ్ళూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షం పడింది. అక్టోబర్‌ 24వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 100.2 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 31.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.

చేబ్రోలు: సైబర్‌ నేరస్తులు రోజురోజుకు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చేబ్రోలు మండలం నారాకోడూరుకు చెందిన ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగిని నమ్మించి రూ.10 లక్షలు దోచుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నారాకోడూరు గ్రామానికి చెందిన వెలక శంకరరావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. తాము బెంగళూరు పోలీసులుగా పరిచయం చేసుకుని ‘మీ అకౌంట్‌’లో పొరపాటున రూ.70 లక్షల నగదు జమ అయ్యాయని, ఇవి నేరస్తులకు చెందిన డబ్బులు అని దీనిని వెంటనే సరిచేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరించారు. దీన్ని సరిచేయడానికి మేము చెప్పే అకౌంట్‌ నంబర్‌కు రూ.10 లక్షలు జమ చేయాలి’ అని బెదిరింపులకు దిగారు. పోలీసులమనే భయంతో పాటు, ఆ డబ్బును సురక్షితంగా కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో శంకరరావు ఆ కేటుగాళ్లు మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత వారి నంబర్లకు ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ రావడంతో తాను మోసపోయినట్లు నిర్ధారించుకున్నాడు. చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చేబ్రోలు ఎస్‌ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే ఎవరూ భయపడకూడదని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని ఎస్‌ఐ వీరనారాయణ సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసపూరిత కాల్స్‌ను నమ్మి కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు.

కుక్క అడ్డురావడంతో

స్కూటీపై నుంచి కిందపడిన వైనం

చిలకలూరిపేటటౌన్‌:మండలంలోని పసుమర్రు సమీపంలో పాత జాతీయ రహదారి–16పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం షేక్‌ హుస్సేన్‌(30) అనే వ్యక్తి జాతీయ రహదారిపై స్కూటీపై వస్తుండగా స్కూటీని కుక్క ఢీకొని అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో హుస్సేన్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement