నామినేషన్‌ వేయమని చెప్పి మోసం | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేయమని చెప్పి మోసం

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

● పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సీటు కేటాయింపులో అన్యాయం చేశారు ● ఆవేదన వ్యక్తం చేసిన 44వ వార్డు టీడీపీ నాయకుడు పోపూరి నరేంద్ర

లక్ష్మీపురం: గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 44వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఆయన సోదరుడు రవి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు భర్త గళ్ళా రామచంద్రరావులు నామినేషన్‌ వేయమని చెప్పి తీరా బీ–ఫామ్‌ వేరే వ్యక్తికి ఇచ్చి మోసం చేశారంటూ 44వ డివిజన్‌ నాయకుడు పోపూరి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా నరేంద్ర విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌ అవుతోంది. ‘‘అయ్యా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పల్లా శ్రీనివాస్‌, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గార్లు’’ అంటూ.. 2019 ఎన్నికల సమయంలో తాను టీడీపీకి ఎంత కష్టపడి పనిచేశాడో.. ఆ ఐదేళ్లు అధికారంలో లేకపోయినా డివిజన్‌లో అందుబాటులో ఉంటూ.. కార్యకర్తల కష్ట సుఖాలు చూసుకుంటూ, కేడర్‌ పోగోట్టుకోకుండా వచ్చిన తాను 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి విజయానికి ఎంతో కృషి చేశానని చెప్పారు. 40వ డివిజన్‌లో రూ.10లక్షలు ఖర్చు పెట్టి పార్టీ కార్యాక్రమాలు ఏర్పాటు చేశానని వీడియోలో తెలిపారు. అటువంటి తనను పార్టీ పెద్దలు, ముఖ్యంగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మోసం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేసిన ఘటనలో, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనలో తనపై కేసులున్నాయని, వీటన్నిటిని తట్టుకొని 44వ డివిజన్‌ అభివృద్ధి కోసం సుమారు రూ.8 కోట్ల అభివృద్ధి పనులు చేశానని తెలిపాడు. 44వ డివిజన్‌పై ఏమాత్రం సంబంధంలేని, పట్టులేని వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని, ఇప్పటికై నా తనకు న్యాయం చేయాలని కోరుతున్నానని వీడియోలో తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement