జగన్మాతా నమోస్తుతే! | - | Sakshi
Sakshi News home page

జగన్మాతా నమోస్తుతే!

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

జగన్మాతా నమోస్తుతే!

పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారు సోమవారం మహిషాసురమర్ధిని దేవిగా భక్తులను అనుగ్రహించారు. శివాలయంలో దేవీనవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు పెదకాకాని శివాలయానికి అధికసంఖ్యలో భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెల్లవారు జామున సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు పర్యవేక్షణలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనములు, పంచగవ్య ప్రాశన, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, నవావరణార్చనలు శాస్త్రోక్తంగా జరిపించారు. విజయదశమి పర్వదినం రోజున మంగళవారం భ్రమరాంబ అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులను అనుగ్రహిస్తారని ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement