తూర్పు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన | - | Sakshi
Sakshi News home page

తూర్పు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

పట్నంబజారు: తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌పై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని 2వ డివిజన్‌కు చెందిన బేళ్ల వెంకటేశ్వర్లు యాదవ్‌ గత 40 సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. 2వ డివిజన్‌ బీసీలకు రిజర్వేషన్‌ ప్రకటించిన నేపథ్యంలో టికెట్‌ ఆశించారు. యాదవ సామాజికవర్గానికి చెందిన వెంకటేశ్వర్లు భార్య వెంకటరమణకు టికెట్‌ ఇవ్వకుండా తన సామాజికవర్గానికి చెందిన వేరే మహిళకు సీటు కేటాయించారంటూ వెంకటేశ్వర్లు, వెంకటరమణ దంపతులు సోమవారం పొన్నూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 2021లో తాను అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయానని, అయినప్పటికీ పార్టీలో కొనసాగుతూ కష్టపడ్డానని తెలిపారు. ఈక్రమంలోనే తాను పార్టీకోసం ఎంతో ఖర్చు చేశానని, అయినప్పటికీ డబ్బులు ఉంటేనే సీటు ఇస్తానని ఎమ్మెల్యే నసీర్‌ చెప్పారన్నారు. ఈక్రమంలో తాను అడిగిన డబ్బు మొత్తం చూపించానని, అయినప్పటికీ సీటు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఎంతో మంది సీట్లు ఆశించి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని మండి పడ్డారు. తాను ఎన్నో ఏళ్లుగా కష్టం చేసిన కనీస గుర్తింపు ఇవ్వలేదని, కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈనేపథ్యంలో పార్టీ అగ్రశ్రేణినాయకులు వెంకటేశ్వర్లు యాదవ్‌తో మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పేవరకు లేవబోమని భీష్మించుకు కూర్చున్నారు. ఇంకా వారి నిరసన కొనసాగుతుంది. ఎమ్మెల్యే వచ్చే వరకు లేవమని తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement