నగరాభివృద్ధికి శాయశక్తులా కృషి | - | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధికి శాయశక్తులా కృషి

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి అట్టహాసంగా రెండో సెట్టు నామినేషన్‌ దాఖలు భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు నగర మేయర్‌ స్థానానికి వైఎస్సార్‌ సీపీ తరఫున తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవి ఆదివారం రెండో సెట్టు నామినేషన్‌ వేశారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాతోపాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి సందడి చేశారు. బృందావన్‌ గార్డెన్స్‌ రోడ్డులోని నగర పాలకసంస్థ సర్కిల్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా తరలివస్తున్న నేతలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అభ్యర్థితోపాటు ఇద్దరే వెంట వెళ్లాలని చెప్పడంతో అంగీకరించిన అంబటి రాంబాబు సహా ఇతర నేతలు అక్కడే ఆగిపోయారు. అనంతరం తాడికొండ శ్రీదేవి, ఆమె భర్త టీఎల్‌వీ వీరాంజనేయులుతో వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement