హక్కుల రక్షణ కోసం పీడీఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల రక్షణ కోసం పీడీఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలి

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

హక్కుల రక్షణ కోసం పీడీఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రజాతంత్ర హక్కుల రక్షణ కోసం పీడీఎఫ్‌ అభ్యర్థి హనుమంతరావును ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం అరండల్‌పేటలోని హోటల్లో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు మద్దతుదారులతో మీడియా సమావేశం నిర్వహించారు. కె.ఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్‌, ప్రజల హక్కుల కోసం పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల ఫోరం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో హనుమంతరావు గెలుపునకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎం.హనుమంతరావు అభ్యర్థిత్వానికి యూటీఫ్‌ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తోందని తెలిపారు. అభ్యర్థి ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని, బోధనకు అవకాశం లేని, భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. మోడల్‌ స్కూల్‌ నాయకురాలు హేమలత మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమస్యలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబడిన సంఘటనలను గుర్తు చేశారు. ఎం. హనుమంతరావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, అధ్యాపకులపై అందరిపై ఉందన్నారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలను బలపరచాల్సిన బాధ్యత ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉందన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్‌ మాట్లాడుతూ గుంటూరు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి పట్టణ ప్రాంతాల్లోని యూటీఫ్‌ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా నమోదు కావాలని కోరారు. సమావేశంలో ప్రైవేటు టీచర్స్‌, మోడల్‌ స్కూల్స్‌, యూనివర్సిటీల రాష్ట్ర నాయకులు సూర్యారావు, బాలాజీ, భాను, మధ్యతరగతి ఉద్యోగుల సంఘ నాయకులు వీవీకే సురేష్‌, ప్రభుత్వ అధ్యాపకుల సంఘ నాయకులు హనుమంతరావు, సీఐటీయూ నాయకులు డి లక్ష్మీనారాయణ, జన విజ్ఞాన వేదిక నాయకులు టి జాన్‌బాబు, యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఏఎన్‌ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ టి.ఎస్‌.ఎన్‌ మల్లేశ్వరరావు, యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, షకీలా బేగం, కోశాధికారి ఎండీ గయసుద్దౌలా, పెన్షనర్ల సంఘ నాయకులు జి.పూర్ణయ్య, ప్రముఖ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్‌ సంఘ నాయకులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement