న్యూస్‌రీల్
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో దారుణంగా విఫలమైన టీడీపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలపై పెరిగిన ఆర్థికభారం నెలవారీ ఖర్చులు భారీగా పెరగడంతో తప్పని కష్టాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం తప్పదని కూటమి నేతల ఆందోళన
కరోనా సమయంలోనూ ఇంత ఇబ్బంది పడలేదు
గుంటూరు
ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
చెరకు మద్దతు ధర ప్రకటన
ఉయ్యూరు(కంకిపాడు): 2026–27 సీజన్‌కు చెరకు టన్ను మద్దతు ధర రూ.3,783గా శనివారం రైతు సంఘాల ప్రతినిధుల సమావేశంలో కేసీపీ యాజమాన్యం ప్రకటించింది.
గుంటూరు వెస్ట్: రోజువారీ పని చేసుకునే పేదలు మొదలు మధ్యతరగతి కుటుంబాల వరకు నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ప్రజలపై పడుతోంది. ఈ రోజు ఉన్న సరుకుల ధర తెల్లారేటప్పటికీ మారిపోతోందంటే అతిశయోక్తి కాదు. చిన్న కుటుంబానికి నెలవారీ నిత్యావసర సరుకుల ఖర్చులో 25 నుంచి 35 శాతం వరకు వ్యత్యాసం వస్తోంది. ఇక బియ్యం విషయానికి వస్తే ధరలు ఊహకందని విధంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కిలో బియ్యం ధర కనీసం రూ.80కి తక్కువ లేదంటే నమ్మాల్సిందే. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణను చాలా తేలికగా చూస్తోంది. ఏదో మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించి, ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకొంటోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న అవస్థలను పట్టించుకోవడం లేదు. అయితే, ఎల్‌నినో ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఈ విషయంలో చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. స్థానిక ఎన్నికల వేళ ఈ ప్రభావం తమ కొంప ముంచుతుందని కూటమి నాయకులు భయపడుతున్నారు.
కొన్ని వస్తువుల ధరలు ఆకాశంలోనే
బియ్యంతోపాటు కందిపప్పు ధర కూడా భారీగా పెరిగింది. ఆరు నెలల క్రితం కిలో కందిపప్పు ధర రూ.110 ఉండగా, ప్రస్తుతం రూ.140కి చేరింది. మినపగుళ్ల ధర రూ.110 నుంచి రూ.140కి, పంచదార రూ.40 నుంచి రూ.70కి, బెల్లం రూ.40 నుంచి రూ.60కి, నూనె ప్యాకెట్ రూ.120 నుంచి రూ.170కి పెరిగాయి. ఇలా నిత్యావసర సరుకులతోపాటు పాలు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆకుకూరలు సైతం ప్రియంగా మారిపోయాయి. ఇటీవల రైతు బజార్లలో బియ్యం, ఉల్లిపాయలను తక్కువ ధరలకు విక్రయిస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించినా, ఆ కార్యక్రమం మూడు నాళ్ల ముచ్చటగానే ముగిసింది. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంతోపాటు విజిలెన్స్ దాడులను పెంచాల్సింది పోయి టీడీపీ సర్కార్ చోద్యం చూస్తోంది.
సామాన్యుడి బతుకు భారం
ఆటో నడిపే వ్యక్తి నెలవారీ ఆదాయం సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకే ఉంటుంది. భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తూ, పిల్లలను చిన్నపాటి పాఠశాలలో చదివించినా పెరిగిపోతున్న సరుకుల ధరలు అతనికి అదనపు భారంగా మారుతున్నాయి. ఇక ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారి సంఖ్య సుమారు 8 వేల వరకు ఉంది. వీరికి నెలకు రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకే జీతం వస్తోంది. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కొద్దిపాటి సంపాదన ఉన్నవారికే పరిస్థితి ఇలా ఉంటే, ఉద్యోగం లేనివారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కూలీనాలీ చేసుకుని జీవించే వారి జీవన స్థితిగతులు అధ్వానంగా మారాయి.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం
ధరల ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశముందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులే భయపడుతున్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో ప్రజలు ధరల పెరుగుదలపై నాయకులను నిలదీస్తున్నారు. సోమవారం నుంచి నగరపాలక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్లాలా అని కూటమి అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడతాయేమోనని భయపడుతున్నారు. దీనికితోడు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంతవరకు సరిగా అమలు కాకపోవడంతో టీడీపీకి సైతం నగరంలో కొన్ని చోట్ల అభ్యర్థులు కరువవుతున్నారంటే నమ్మాల్సిందే.
‘‘ఏంటండీ, కిలో బియ్యం రూ.80నా? ఇక నూనె, ఇతర వస్తువుల ధరలైతే మరీ ఎక్కువగా ఉన్నాయి. మాది చిన్నపాటి సొంతిల్లు. అయినప్పటికీ నెలకు తక్కువలో తక్కువగా రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. కరోనా లాంటి క్లిష్ట సమయంలో అప్పటి ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో డబ్బులు వేసి ఆదుకుంది. ప్రభుత్వం తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించే విధంగా ప్రత్యేక స్టోర్లు ఏర్పాటు చేయాలి
– మామిడి ప్రియాంక, గృహిణి, గోరంట్ల


