పెండ్లికుమార్తె తండ్రి అనారోగ్యంతో మృతి
దుగ్గిరాల: శుభకార్యాక్రమం జరగాల్సిన ఇంట విషాదం చోటుచేసుకుంది. ఇంటి యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివరాలు.. మండలం చిలువూరుకు చెందిన నెమలికంటి మరియదాసు(55), ఎండీ అఖిల బేగం భార్యాభర్తలు. వీరికి కుమారుడు కృపానిధి, కుమార్తె మహిమ ఉన్నారు. కుమార్తెకు 17వ తేదీ వివాహానికి నిశ్చతార్థం చేసుకున్నారు. గత ఆదివారం సాయంత్రం అధిక రక్తపోటు గురికావడంతో మంగళగిరిలోని ఎయిమ్స్‌కు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శనివారం కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా మృతి చెందడంతో గ్రామం విషాదఛాయలు అలుముకున్నాయి. మరియదాసు వైఎస్సార్ సీపీలో పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా ఉండేవారు. ఆయన మృతికి పార్టీ నేతలు నివాళులర్పించారు.
పెదనందిపాడు: తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి బంగారం చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రత్తిపాడు సీఐ పి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పెదనందిపాడు పోలీస్‌స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పెదనందిపాడుకు చెందిన బెల్లం శ్రీనివాసరావు ఇంట్లో ఎవరు లేని సమయంలో అదే గ్రామానికి చెందిన జరుగుల లోకేష్ బంగారం అపహరించినట్లు ఫిర్యాదు చేశారని, లోకేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, శుక్రవారం ఉదయం నల్లమడ వాగు వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న లోకేష్ అదుపులోకి తీసుకొని విచారించగా బెల్లం శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం చేసిన విషయం అంగీకరించాడని చెప్పారు. నిందితుని వద్ద నుంచి సుమారు రూ.6,50,000 విలువైన 68 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని, నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్ఐ ఏక్నాధ్ను అభినందించారు.
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో ధరలు బారీగా పెరిగాయి. నాలుగు రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం గరిష్టంగా రూ.18,700లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వ్వాపారానికి అన్‌సీజన్ కావడంతో ఎగుమతుల్లో కదలిక వచ్చి నెలకొన్న డిమాండ్‌తో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగన ధరలు వ్యాపారులకు మరింత లబ్ధి చేకూరనుంది. రైతులు దగ్గర ప్రస్తుతం పసుపు నిల్వలు లేవు, ఇదే విధంగా ధరలు నిలకడగా పంట చేతికి వచ్చే వరకు ధరలు ఉండాలని రైతులు కోరుకుంటుంన్నారు.


