యువకుడికి క్లిష్టమైన రీడూ గుండె శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

యువకుడికి క్లిష్టమైన రీడూ గుండె శస్త్రచికిత్స

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

యువకుడికి క్లిష్టమైన రీడూ గుండె శస్త్రచికిత్స ● 17 ఎంఎం వాల్వు స్థానంలో 25 ఎంఎం అమరిక ● విజయవంతం చేసిన మణిపాల్‌ వైద్యులు

తాడేపల్లి రూరల్‌: తీవ్రమైన గుండె సమస్యలతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న 27 ఏళ్ల యువకుడికి తాడేపల్లిలోని మణిపాల్‌ హాస్పిటల్‌లో క్లిష్టమైన రీడూ గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గురువారం వైద్యులు శస్త్ర చికిత్స వివరాలను వెల్లడించారు. గతంలో అమర్చిన 17 ఎంఎం పల్మనరీ వాల్వును తొలగించి, దాని స్థానంలో 25 ఎంఎం వాల్వును అమర్చడంతోపాటు గుండెలో రక్తప్రసరణకు అడ్డంకులుగా ఉన్న సమస్యలను సరిచేశామని తెలిపారు. పుట్టుకతోనే సంక్లిష్ట గుండె లోపాలతో బాధపడుతున్న యువకుడికి 10 సంవత్సరాల వయసులో గుండె శస్త్ర చికిత్స చేశారు. వయసు, బరువు పెరగడంతో పాత వాల్వు సరిపోకపోవడంతోపాటు గుండె వాల్వులో లీకేజ్‌ ఏర్పడింది. దీంతో రెండవ సారి కిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చింది. అయోర్టిక్‌ వాల్వు సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. యువకుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. ప్రస్తుతం యువకుడు ఇంటెన్సివ్‌ కేర్‌ నుంచి జనరల్‌ వార్డుకు మారి కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. కన్సల్టెంట్‌ సిటివిఎస్‌ డాక్టర్‌ దిలీప్‌ రట్టి మాట్లాడుతూ వైద్య బృందాల సమన్వయం, ముందస్తు ప్రణాళికతో క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్స బృందంలో ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ శంకరరావు, డాక్టర్‌ అనీల్‌, పిడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ చిష్టి, పెర్ఫ్యూసినిస్ట్‌ రమేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement