దసరా వేడుకలకు భారతీయ చేనేత వస్త్రాలు | - | Sakshi
Sakshi News home page

దసరా వేడుకలకు భారతీయ చేనేత వస్త్రాలు

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

నగరంపాలెం: స్థానిక రింగ్‌రోడ్డు సిద్ధార్థ కన్వెన్షన్‌ సెంటర్‌లో నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఎక్స్‌పో ఈనెల 19 వరకు కొనసాగనుంది. దేశంలోని పలు రాష్ట్రాల చేనేత కళాకారులు, నేత కార్మికుల ప్రత్యేక వస్త్ర సంపద ఒకే వేదికపై విభిన్న ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాల అనుబంధాన్ని ప్రదర్శించారు. నేత కార్మికులు రూపొందించిన పట్టు, కాటన్‌ వస్త్రాలు, సరికొత్త డిజైన్ల చీరలు, డిజైనర్‌ చీరలు, బ్లౌజులు, కుర్తీలు, వేలాది రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. వస్త్రాలపై యాభై శాతం తగ్గింపు ఽకొనుగోళ్లను ప్రవేశపెట్టారు. పైఠానీ పట్టు చీరలు (కర్ణాటక), సాఫ్ట్‌సిల్క్‌ వస్త్రాలు, చందేరి, మహేశ్వరి పట్టు చీరలు (మధ్యప్రదేశ్‌), డిజైన్‌ చీరలు, బాలుచరి, జమ్దానీ, టాంగైల్‌, ఢాకాయ్‌ మస్లిన్‌ సిల్క్‌, లినెన్‌ చీరలు, కాంతావర్క్‌ ఎంబ్రాయిడరీ వస్త్రాలు (పశ్చిమ బెంగాల్‌), టస్సర్‌ సిల్క్‌, మట్కా సిల్క్‌, భాగల్‌పూర్‌ పట్టు వస్త్రాలు (బీహార్‌), బాంధినీ, కచ్‌ ఎంబ్రాయిడరీ, పటోలా చీరలు (గుజరాత్‌), కాంచీపురం పట్టు చీరలు (తమిళనాడు), ఎంబ్రాయిడరీ పట్టు వస్త్రాలు, టాబీ సిల్క్‌ చీరల (జమ్ము కశ్మీర్‌)లు ఉన్నాయని నిర్వాహాకులు తెలిపారు. విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన డిజైన్‌ చీరలు, దుప్పట్లు, సల్వార్‌ మెటీరియల్స్‌, బనారసీ పట్టు చీరలు, జమ్దానీ, షిఫాన్‌ చీరలు ఉన్నట్లు చెప్పారు. దసరా పండుగ, వివాహ వేడుకలకై ప్రత్యేకమైన దుస్తులను కొనుగోలుకు ఈ ప్రదర్శనను ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement