అడ్డంకులు సృష్టిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అడ్డంకులు సృష్టిస్తే చర్యలు

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 అడ్డంకులు సృష్టిస్తే చర్యలు పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

సాక్షి : రాజకీయ పక్షాలకు మీరు చేసే సూచనలు ఏంటి?

సాక్షి : పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు?

గుంటూరు
శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

● స్థానిక సంస్థలు ఎన్నికలను

నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం

● అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు

24 గంటల్లో మంజూరు

● బలవంతంగా నామినేషన్లను

ఉపసంహరిస్తే చర్యలు తప్పవు

● సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

● జిల్లా ఎస్పీ సమన్వయంతో ఎన్నికలు

ప్రశాంతంగా జరిగేలా చర్యలు

● కలెక్టర్‌ ఆఫీసులో ఫిర్యాదుల విభాగం

ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిష్కారం

● ‘సాక్షి’ స్పెషల్‌ ఇంటర్వ్యూలో

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.8780 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

కలెక్టర్‌ : ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల వారు అధికారులకు సహకరించాలి. పార్టీల పరంగా ఎలా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా అన్ని పార్టీల నేతలు ముందుకు వెళ్లాలి. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలి.

కలెక్టర్‌ : పోలింగ్‌ బూత్‌ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో కలిసి అన్ని భద్రతా చర్యలు చేపట్టాం. సున్నిత, అతి సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. వాటిలో అదనపు సిబ్బందిని నియమించాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

సాక్షిప్రతినిధి, గుంటూరు: ‘‘ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఎంసీసీ టీమ్‌లతోపాటు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము, కంప్లయింట్‌ సెల్‌లు ఏర్పాటు చేశాం. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం గుంటూరు కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికతోపాటు 76 డివిజన్లకు, తెనాలి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికతోపాటు 52 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నేటి నుంచి నామినేషన్‌ల ప్రక్రియ మొదలవుతోంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాం. జిల్లాలో 13 జెడ్పీటీసీలు, 13 ఎంపీపీ స్థానాలతోపాటు 199 ఎంపీటీసీ స్థానాలు, 208 సర్పంచ్‌లకు వాటి పరిధిలోని వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సుమారు 9 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతారని’’ జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌వర్మ ‘సాక్షి’ స్పెషల్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే...

సాక్షి : ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలపై మీ స్పందనేంటి?

కలెక్టర్‌ : గతంలో ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల వరకు పట్టేది. అయితే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం 24 గంటల్లో ఇచ్చేస్తున్నాం. దీనిపై జేసీ, డీఆర్‌వోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

సాక్షి :కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుపై గందరగోళాన్ని ఎలా పరిష్కరిస్తారు?

కలెక్టర్‌ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎటువంటి జాప్యం ఉండదు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ కుల ధ్రువీకరణ పత్రం కలిగిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నో డ్యూస్‌ సర్టిఫికెట్లు మాత్రం ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది.

సాక్షి : నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కలెక్టర్‌ : ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్‌లు వేసుకుని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించినప్పుడు సూచించాం. ఎక్కడైనా బలవంతంగా నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేయడం, నామినేషన్‌ వేసేవారిని అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.

సాక్షి : ఎన్నికల సమయంలో జరిగే అవకతవకలపై ఎలాంటి చర్యలు చేపట్టారు?

కలెక్టర్‌ : ఎన్నికల ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లాలోని అందరు అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదు. కలెక్టర్‌ కార్యాలయంలో కంప్లయింట్‌ సెల్‌ ఏర్పాటు చేస్తాం. ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తాం.

సాక్షి : ఎస్‌ఐఆర్‌ ప్రకారం జిల్లాలో 2 లక్షలకుపైగా ఓట్లు తొలగించారు. మరి వారంతా ఎన్నికల్లో ఓటు వినియోగించుకుండా ఎలా చూస్తారు?

కలెక్టర్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌తో సంబంధం లేదు. 2026 జనవరి 1న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement