గుంటూరు ఎడ్యుకేషన్: దేశం గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అందరికీ ఆదర్శ ప్రాయుడని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమాలతో కలసి అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ రామేశ్వరంలో అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం విద్యను అయుధంగా మలచుకుని అంచెలంచెలుగా ఎదిగి, గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారని అన్నారు. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించి ఆ పదవికే వన్నె తెర్చారని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగంలో అందించిన విశేష కృషిని మరువరాదన్నారు. విద్యార్థులు, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, ఎస్ఈసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పఠాన్ సైదా ఖాన్, షేక్ షర్ఫుద్దీన్, జిల్లా ప్రచార విభాగాధ్యక్షుడు దానం వినోద్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్, నగర బీసీ సెల్ అధ్యక్షుడు పల్లపు మహేష్బాబు, జిల్లా మైనార్టీ విభాగ నాయకులు బషీర్, ఉమర్, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుంజర ప్రభు, మైనార్టీ విభాగాధ్యక్షుడు ఖాసిం బేగ్, అనుబంధ విభాగాల నాయకులు చింతపల్లి వెంకటరమణ, పల్లపు వెంకటేష్, స్వర్ణలత, విజయారెడ్డి, రజియా బేగం, తదితర నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు


