ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP Files Complaint With EC Over Election Code Violations | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Oct 15 2026 6:15 PM | Updated on Oct 15 2026 6:25 PM

YSRCP Files Complaint With EC Over Election Code Violations

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల సంఘాలకు వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. యథేచ్ఛగా జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ, సీఈసీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లను తొలగించలేదని.. సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులో పేర్కొంది.

ఎన్నికల కోడ్‌ను టీడీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో ఎన్నికల నిర్వహణలో అధికారుల నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయి. 

‘‘ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు, కటౌట్లను తక్షణమే తొలగించాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. అనుమతి లేని ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటును అడ్డుకోవాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలి’’ అని ఫిర్యాదులో లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement