రేపు జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీలు

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

రేపు జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీలు గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ప్రథమ విషీస్‌ కప్‌ డిస్ట్రిక్ట్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ను శుక్రవారం స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు ఎం.గోపీనాధ్‌ తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం హిందూ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ సీహెచ్‌ సుబ్బారావు, డైరెక్టర్‌ పీఎం ప్రసాద్‌లు ఆవిష్కరించారు. గోపీనాఽథ్‌ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌లో వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని, టోర్నమెంట్‌లో మొత్తం రూ.20,000 నగదు బహుమతులు అందజేస్తామన్నారు. అంతేకాకుండా, వివిధ వయస్సుల కేటగిరీల్లో కూడా ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం 9703049378 నెంబర్‌కు సంప్రదించాలన్నారు. నయా మోసం! ఆశా వర్కర్లకు ఒకేసారి జీతం ఇవ్వాలి తాడి చెట్టు పడి వ్యక్తి మృతి

తాకట్టులో ఉన్న బంగారం విడిపించాలని కోరి.. రూ.5.50లక్షలతో పరారీ

నర్సంపేట రూరల్‌: తాకట్టులో ఉన్న బంగారం విడిపిస్తే మళ్లీ మీకే ఆ బంగారాన్ని విక్రయిస్తామని చెప్పి రూ.5.50 లక్షలు మాయం చేశాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. తన బంగారం ఫెడ్‌ బ్యాంకులో తాకట్టులో ఉందని, ఆ బంగారాన్ని విడిపిస్తే తిరిగి మీకే విక్రయిస్తానని గుంటూరుకు చెందిన శ్రీఆంజనేయ గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీని ఫోన్‌లో వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన బోడ శ్రీకాంత్‌ సంప్రదించాడు. దీంతో ఆ కంపెనీ.. తన సేల్స్‌మన్‌ని ఈనెల 13న నర్సంపేటకు పంపించింది. సదరు సేల్స్‌మన్‌ని శ్రీకాంత్‌ రిసీవ్‌ చేసుకుని అంగడి రోడ్డులో ఉన్న సెంట్రల్‌ బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఈ బ్యాంకులోనే తనకు ఖాతా ఉందని, నగదును బదిలీ చేస్తే తాను ఫెడ్‌బ్యాంక్‌కు బదిలీ చేసి బంగారం తీసుకొస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ గోల్డ్‌ఫైనాన్‌ సేల్స్‌మెన్‌ నమ్మి కంపెనీ ప్రతినిధులో మాట్లాడి రూ.5 లక్షలు శ్రీకాంత్‌ ఖాతాలో జమ చేయించాడు. మరో రూ.50వేలు ఫోన్‌పే ద్వారా పంపించాడు. అనంతరం, సెల్స్‌మెన్‌ను అక్కడే కూర్చోబెట్టి ఇప్పుడే వెళ్లి వస్తానని చెప్పి అక్కడినుంచి శ్రీకాంత్‌ వెళ్లిపోయి తిరిగిరాలేదు. అనంతరం మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. దీంతో మోసపోయినట్లు సెల్స్‌మెన్‌ గ్రహించి నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు. గతంలో కూడా శ్రీకాంత్‌పై పలు సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌ వివరించారు.

లక్ష్మీపురం: ఆశా వర్కర్స్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ఒకేసారి రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఒకే ఖాతాలో జమ చేయాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు జి.రమణ కోరారు. గుంటూరు జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం యూనియన్‌ నాయకులు జిల్లా వైద్యశాఖ అధికారి పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీతం కేవలం పదివేల రూపాయలు మాత్రమేనని, ఆ పదివేలు కూడా ఒకేసారి పడకపోవడం వలన అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పారితోషికం ఏ అకౌంట్లో పడుతున్నాయో కూడా అర్థం కావడం లేదని ఆమె అన్నారు. 2019 లో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.7 వేల నుంచి రూ.10 వేలు పెంచిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్‌ సరోజినీ, సిరాజ్‌ బీ, నాగజ్యోతి పాల్గొన్నారు.

అమృతలూరు(వేమూరు) తాడి చెట్టు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు అమృతలూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన కుర్రా వెంకటేశ్వరరావు(62)పై తాడి చెట్టు పడి మంగళవారం మృతి చెందినట్లు అమృతలూరు ఎస్‌ఐ సుమన్‌ బుధవారం తెలిపారు. మంగళ వారం సాయంత్రం తన పొలంలో పొక్లయినర్‌తో తాడి చెట్లు పీకించడం జరిగింది. ఈ క్రమంలో తాడి చెట్టు తలపై పడడంతో తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం శవ పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement