బాల్యవివాహాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను అరికట్టాలి

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

● చివరకు బయటకు తీసిన పోలీసులు ● బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు ● మృతిపై పలు అనుమానాలు

డీఎంహెచ్‌ఓ పద్మావతి

గుంటూరు మెడికల్‌: బాల్య వివాహాలను అరికట్టాలని డీఎంహెచ్‌ఓ ఎం.పద్మావతి కోరారు. హై రిస్క్‌ ప్రెగ్నెన్సీ ప్రోటోకాల్స్‌పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం డీఎంహెచ్‌ఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఏఎన్‌ఎంలకు హై రిస్క్‌ గర్భిణుల గుర్తింపు, తగిన జాగ్రత్తలు, వైద్య సేవలు, రిఫరల్‌ విధానాలపై పలు సూచనలు అందించారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించే అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికల హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలన, బాలికలకు సమాన విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రక్షణ కల్పించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బాలికల ఆరోగ్యం, విద్య, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే దేశ భవిష్యత్‌కు పునాది వేయడమేనన్నారు. ప్రతి బాలికకు సమాన హక్కులు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వైద్య సేవలు, సురక్షితమైన వాతావరణం అందించాలని కోరారు. బాలికలను గౌరవించడం, ప్రోత్సహించడం, వారి కలలను సాకారం చేసేందుకు తోడ్పడటం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎ.శ్రీవల్లి, డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ కె.ప్రియాంక, డాక్టర్‌ భార్గవ్‌, అర్మన్‌ సంస్థ ప్రతినిధులు, డాక్టర్‌ చరణ్‌ పాల్గొన్నారు.

నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం

తాడేపల్లి రూరల్‌: కృష్ణా కెనాల్‌– తాడేపల్లి ప్రధాన రహదారి మధ్యలో ఉన్న ఓ నేలబావిలో మృతదేహం కలకలం రేపింది. మంగళవారం బావిలో మృతదేహం ఉన్నట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. తొలుత ఘటన తమ పరిధిలోకి రాదని, రైల్వే పోలీసుల పరిధికి వస్తుందని చెప్పడంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రక్రియలో జాప్యం జరిగినట్లు తెలిసింది. చివరకు సాయంత్రం తాడేపల్లి పోలీసులే బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతుడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహం లభించిన నేలబావి రైల్వేస్టేషన్‌కు సుమారు 150 అడుగుల దూరంలో ఉన్నట్లు తెలిసింది. మృతికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణకు రాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి

తెనాలిటౌన్‌: విద్యుదాఘాతంతో ఎలక్ట్రికల్‌ వర్కర్‌ మృతి చెందిన ఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా నగరం మండలం సజ్జవారిపాలెం అగ్రహారానికి చెందిన అమర్తలూరి అక్షయ్‌ బాబు(30) తెనాలి పట్టణంలో ఓ కాంట్రాక్టర్‌ వద్ద విద్యుత్‌ కార్మికునిగా పనిచేస్తున్నాడు. స్థానిక నందులపేట వినాయకుని గుడి రోడ్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు సదరు రవీంద్ర అనే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పనిచేస్తుండగా స్తంభంపై ఉన్న అక్షయ బాబు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్వర్టర్‌ రిటర్న్‌ సప్లయి కారణంతో అక్షయ మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని ఏపీ సీపీడీసీఎల్‌ తెనాలి డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అక్కల సత్యనారాయణ, టౌన్‌ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బోరుగడ్డ అశోక్‌ కుమార్‌ పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య ఐదు సంవత్సరాల కుమార్తె ఉన్నట్టు బంధువులు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని విద్యుత్‌ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నందులపేట ప్రాంతంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం ఐదు గంటల తరువాత సరఫరా పునరుద్ధరించారు.

బొల్లాపల్లి టోల్‌గేట్‌ వద్ద తప్పిన పెను ప్రమాదం

మార్టూరు(యద్దనపూడి): బొల్లాపల్లి టోల్‌గేట్‌ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. నెల్లూరు డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు మంగళవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా వెనుక టైరు పేలిపోయింది. వెంటనే టైర్లలో మంటలు చెలరేగటంతో ప్రమాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో సమీపంలో ఉన్న హైవే మొబైల్‌ పోలీసులు వెంటనే స్పందించి బస్సులో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఆర్పీవీ సిబ్బందికి , హైవే అంబులెన్స్‌ సమాచారం అందించటంతో వారు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకొని హైవే మొబైల్‌ సిబ్బంది రవి, ఆర్పీవీ సిబ్బంది జ్ఞానేంద్ర ఇరువురూ ఫైర్‌ సిలిండర్‌ సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మెత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారుల చొరవతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సిబ్బంది మరో రెండు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. సమయానికి స్పందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులను, సహాయక సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement