బాలా త్రిపుర సుందరీ | - | Sakshi
Sakshi News home page

బాలా త్రిపుర సుందరీ

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

పాహిమాం..

పాహిమాం..
బాలా త్రిపురసుందరిదేవి అలంకారంలో భ్రమరాంబదేవి దర్శనం

పెదకాకాని: పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబదేవి అమ్మవారు సోమవారం బాలాత్రిపురసుందరిదేవి అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు. భ్రమరాంబదేవి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, పంచహారతులు ఇచ్చారు. యాగశాలలో భక్తులు రుద్ర, చండీ హోమాలు జరిపించుకున్నారు. అధికసంఖ్యలో భక్తులు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉప కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగంగా 5.30 గంటల నుంచి కృష్ణా జిల్లా గోశాలకు చెందిన బిళ్లా భాస్కరరావుచే భజనా కాలక్షేపం, విజయవాడ నటరాజ నృత్యాలయం వారిచే కూచిపూడి నృత్యం, మద్దిరాలకు చెందిన గోరంట్ల సింగర కొండయ్య చౌదరి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ విజయాలు పౌరాణిక నాటకం ప్రదర్శించారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం భ్రమరాంబదేవి అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారని డీసీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement