పేదలంటే అంత చులకనా? | - | Sakshi
Sakshi News home page

పేదలంటే అంత చులకనా?

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

ధర్మంగానే ఇమ్మంటున్నాం సమస్యలు వినేవారే కరువయ్యారు రాజధానిలో పేదలకు చోటులేదా?

రైతులు కన్నీళ్లు పెడితే మంచి జరగదు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫేజ్‌–3 బాధితుల ఆవేదన తెనాలి ఆర్డీఓపై ఆగ్రహం.. పీజీఆర్‌ఎస్‌లో జేసీకి ఫిర్యాదు

ఆత్మహత్యలకై నా సిద్ధమే..

గుంటూరు వెస్ట్‌: తమ వేదనను పట్టించుకునే వారు లేకపోవడంతో తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫేజ్‌–3 బాధితులు రోడ్డెక్కారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫేజ్‌–3లోని ఇ–3 రోడ్డు కోసం సుమారు 20 మందికి చెందిన 1.24 ఎకరాల భూమిని అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిని బాధితులు వ్యతిరేకించినా సీఆర్డీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవకు వినతిపత్రం అందజేశారు. ఆత్మహత్యలైనా చేసుకుంటాం గాని తమ స్థలాలను వదులుకోబోమని తెగేసి చెబుతున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు వందల ఎకరాలు దోచి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పేదలంటే లేక్కలేదా.. అంత చులకనా అని ప్రశ్నిస్తున్నారు. వారిలో కొందరి అభిప్రాయాలు.

మేం స్థలాలు ఖాళీ చేసి వెళ్లము అనడం లేదు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ప్రకారమే నష్టపరిహారం అడుగుతున్నాం. ఈ స్థలంపై పిల్లల చదువులతోపాటు అనేక బాధ్యతలు ముడిపడి ఉన్నాయి. అధికారులకు మా బాధలు అస్సలు పట్టడంలేదు. 170 చ.గజాల రిజిస్ట్రేషన్‌ కూడా జరిగిన భూమి. అయినా నష్టపరిహారం ఇవ్వము, ఖాళీ చేయమంటున్నారు. తెనాలి ఆర్డీఓ మాపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు. న్యాయం చేయండి.

–ఎస్‌.సుజాత, బాధితురాలు

నేను పాతికేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు 233 చ.గ. రిజిస్ట్రేషన్‌ స్థలం ఉంది. ఇప్పుడు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డంటూ మమ్మల్ని రోడ్డు కీడుస్తున్నారు. అభివృద్ధి కోసం మా స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమే. అయితే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వబోమని తెనాలి ఆర్డీఓ తెగేసి చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఈ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించిన పాపానికి మాపై కక్ష కట్టారు. నష్టపరిహారం ఇవ్వందే మేం కదిలేది లేదు.

–సిహెచ్‌. నాగమల్లికార్జునరావు, బాధితుడు

నేను ఇల్లు కట్టుకుని చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను. భర్తలేడు. ఒక ఆడపిల్ల ఉంది. మిషన్‌ కుట్టుకుని జీవిస్తున్నాను. ఇప్పుడు వచ్చి అధికారులు నన్ను వెళ్లిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్లాలి. ఈ రాజధాని ధనికుల కోసమేనా. మాలాంటి పేదలకు ఇక్కడ చోటులేదా? కనీసం నష్టపరిహారం కింద ఒక ఇల్లు ఇచ్చినా వెళ్లిపోతానంటున్నా నా మాట వినడంలేదు. న్యాయం చేయండి.

– పి.దుర్గ, బాధితురాలు

కేవలం 20 మంది బాధితులకు నష్టపరిహారమిస్తే వెళ్లిపోతామంటున్నాం. కనీసం మా మాట వినడంలేదు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడంలేదు. ఇదెక్కడి న్యాయం. మేం నష్టపరిహారం మాత్రమే అడుగుతున్నాం. నాకున్న 226 చ.గజాల రిజిస్ట్రేషన్‌ భూమిని ఉచితంగా ఇచ్చేయ్యాలా? మేం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమే.

–కె.రామకృష్ణ, బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement