డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ మక్కెన పద్మావతి | - | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ మక్కెన పద్మావతి

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ మక్కెన పద్మావతి చేబ్రోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తనిఖీలు

గుంటూరు మెడికల్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్‌ మక్కెన పద్మావతిని నియమిస్తూ సోమవారం డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ కె.పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో గుంటూరు గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో సివిల్‌ సర్జర్‌ ఆర్‌ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ పద్మావతిని ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌(ఎఫ్‌ఏసీ) డీఎంహెచ్‌ఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన డాక్టర్‌ మక్కెన పద్మావతి గుంటూరు మెడికల్‌ కాలేజ్‌లో 1988లో ఎంబీబీఎస్‌ చదివారు. నూజెండ్ల మెడికల్‌ ఆఫీసర్‌గా 1998లో విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీస్‌లోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్‌ సర్జన్‌గా 2014లో పదోన్నతి పొంది ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌గా(డీఐఓ), జిల్లా శిక్షక్షణా టీమ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా (పీఓడీటీటీ) పనిచేశారు. సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓగా పదోన్నతి పొంది గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రికి బదిలీ అయ్యారు. డీఎంహెచ్‌ఓ ఉత్తర్యులు అందుకున్న డాక్టర్‌ మక్కెన పద్మావతికి పలువురు వైద్యాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.

చేబ్రోలు: చేబ్రోలు సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉన్నత పాఠశాలను విద్యాశాఖ కమిషనర్‌, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి రంజిత్‌ బాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆయనతో పాటు రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, ఆర్‌ఐఓ సునీత ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ సుచరిత, హైస్కూల్‌ హెచ్‌ఎం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement