గుంటూరు ఎడ్యుకేషన్: కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని కేజీబీ విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యదర్శి డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని కేజీబీవీల ప్రిన్సిపాల్స్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా దేవానంద్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన, తల్లిదండ్రులకు దూరమైన విద్యార్థినులు కేజీబీవీల్లో చదువుతున్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందించడంలో ప్రిన్సిపాల్స్, వార్డెన్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి హాస్టల్‌కు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రతి నెల మొదటి వారంలో పంపుతామని, విద్యార్థినుల పెరుగుదల, అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉండాలన్నారు. భద్రత విషయంలో రాజీ పడవద్దని, ప్రతి హాస్టల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయించాలన్నారు. పల్నాడు సమగ్రశిక్ష ఏపీసీ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ అన్ని కేజీబీవీ హాస్టల్ బిల్డింగ్స్ పూర్తి వినియోగంలోకి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జీసీడీవో పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
తాడికొండ: వినాయక ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం సందర్భంగా బుధవారం నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.11.50 లక్షలు పలికింది. దొండపాడు డీడీసీ యూత్ ఆధ్వర్యంలో 15వ సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. 25 కేజీల లడ్డూను కొమ్మినేని కిరణ్ రూ.11,50,116లకు దక్కించుకున్నారు.


