వీవీఐటీయూలో లింక్డ్‌ ఇన్‌ లెర్నింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వీవీఐటీయూలో లింక్డ్‌ ఇన్‌ లెర్నింగ్‌ ప్రారంభం

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

పెదకాకాని: విద్యార్థులకు ప్రపంచస్థాయి ఆధునిక, సాంకేతిక నైపుణ్యాలు అందించే దిశగా ప్రముఖ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌, ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డ్‌ ఇన్‌ లెర్నింగ్‌తో వీవీఐటీ విశ్వవిద్యాలయం కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రొ–చాన్సలర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ తెలిపారు. మండల పరిధిలోని నంబూరు వీవీఐటీలో నిర్వహించిన కోర్సుల ప్రారంభ కార్యక్రమంలో లింక్డ్‌ ఇన్‌ సౌత్‌ అండ్‌ వెస్ట్‌ రీజనల్‌ హెడ్‌ చింతా కృష్ణారెడ్డి, సౌత్‌ రీజనల్‌ అకౌంట్‌ డైరెక్టర్‌ సాక్షి రహేజా, ఐయూసీఈఈ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కృష్ణ వేదుల, చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొ–ఛాన్సలర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు లింక్డ్‌ ఇన్‌ లెర్నింగ్‌లోని వేలాది సర్టిఫైడ్‌ కోర్సులను ఉచితంగా పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైనన్స్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ రంగాలలో అంతర్జాతీయ నిపుణులు రూపొందించిన కోర్సులు లింక్డ్‌ఇన్‌ లెర్నింగ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థులు పూర్తి చేసిన ప్రతి కోర్సుకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌ లభిస్తుందని, ఇది వారి ప్రొఫైల్‌కు అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా భారీ వేతనాలతో బహుళ జాతీయ సంస్థలలో ఉద్యోగాలు (నియామకాలు) పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వీవీఐటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరెడ్డి, కార్పొరేట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్‌్‌స డైరెక్టర్‌ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, లింక్డ్‌ ఇన్‌ లెర్నింగ్‌ సెంటర్‌ సమన్వయకర్త డాక్టర్‌ నూతలపాటి అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement