వైఎస్సార్‌సీపీ నాయకురాలి అరెస్టుకు విఫలయత్నం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకురాలి అరెస్టుకు విఫలయత్నం

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

తెనాలిలో మాచవరం పోలీసుల అత్యుత్సాహం మహిళా విభాగం అధ్యక్షురాలు రాగమంజరి ఇంటికి అర్ధరాత్రి తర్వాత వచ్చిన పోలీసులు లీగల్‌సెల్‌ ప్రతినిధుల నిలదీతతో వెనుకడుగు

తెనాలి: మెగా డీఎస్సీలో అక్రమాలపై విజయవాడలోని ‘శాప్‌’ కార్యాలయం ఎదుట భారీ ధర్నాతో శాంతియుతంగా నిరసన తెలిసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. అరెస్టులు చేస్తున్నారు. ఆ ధర్నాలో పాల్గొన్న తెనాలి నాయకులపైనా కేసులు నమోదు చేశారు. పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కొంగర రాగమంజరిని అరెస్టు చేసేందుకు మాచవరం పోలీసులు తెనాలిలో సోమవారం అర్ధరాత్రి తర్వాత హడావుడి చేశారు. మాచవరం పోలీసులు, తెనాలి వన్‌టౌన్‌ పోలీసులు కలిసి అరెస్టు చేసేందుకు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో రాగమంజరి నివాసానికి వెళ్లారు. విషయం తెలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మైలా విజయ్‌నాయుడు, మరో న్యాయవాది చింకా సురేష్‌ చంద్రయాదవ్‌లు అక్కడకు చేరుకున్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అరెస్టుకు సంబంధించిన కేసు వివరాలు, నోటీసు తదితర అంశాలపై నిలదీశారు. కొంతసేపు తర్జనభర్జన అనంతరం పోలీసులు తిరిగివె వెళ్లిపోయారు. రాగమంజరి చౌదరి అరెస్టు యత్నం వ్యవహారంపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్టులకు ప్రయత్నించడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే కక్షకట్టి అక్రమంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని రాగమంజరి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement