యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

ఈగల్‌ చీఫ్‌ ఐజీ ఆకే రవికృష్ణ

మంగళగిరి రూరల్‌: యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా నశాముక్త్‌ యువ–వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళగిరి మండలం బేతపూడిలోని అమృత యూనివర్సిటీలో ఆదివారం రాష్ట్రీయ సంకల్ప సమారోహ్‌ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నిశాముక్త్‌ భారత్‌ కోసం ఇచ్చిన పిలుపులో మనం భాగస్వాములు కావాలన్నారు. మీ సమీపంలో గాని, మీ క్యాంపస్‌లోగాని ఎవరైనా డ్రగ్స్‌ వాడినట్లయితే వారి గురించి ఈగల్‌ కార్యాలయానికి, 1972 కాల్‌ సెంటర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామంటూ విద్యార్ధులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేసి, సంతకాల సేకరణ నిర్వహించారు.

కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ సి కె జయశంకర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎంఎస్‌ విజయేంద్ర, వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రసాద్‌కుమారి, ఈగల్‌ ఆపరేషన్‌ ఎస్పీ మహేశ్వరరాజు, అడ్మిన్‌ ఎస్పీ స్వరూపరాణి, డీఎస్పీలు సింగయ్య, త్రినాథ్‌, గుంటూరు ఈగల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ రవీంద్ర, మంగళగిరి రూరల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌లు వెంకట్‌, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement