● సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్‌లో వక్తలు ● అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సమాఖ్య గ్లోబల్ 2026 గ్లోబల్ బిజినెస్ మీట్
తాడేపల్లి రూరల్: వాణిజ్యం, పరిశ్రమలు, వ్యాపారోద్యమాన్ని ప్రోత్సహించడంతోపాటు సహకారం, నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా వ్యాపార రంగాన్ని బలోపేతం చేయడమే సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ లక్ష్యమని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్, కార్యక్రమ నిర్వాహకుడు ఏవీ రత్నం తెలిపారు. ఆదివారం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్, విశ్వ సమాఖ్య పటేల్ ఎంటర్‌టైనర్ నెట్‌వర్క్, అఖిలభారత తెలగ బలిజ కాపు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సమాఖ్య 2026–గ్లోబల్ బిజినెస్ మీట్‌ను నిర్వహించారు. ఏవీ రత్నం మాట్లాడుతూ సమాఖ్య వెనుక దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌లు మాట్లాడారు. యువ పారిశ్రామికవేత్తలకు నిరంతర మద్దతు అందించడం, ఆర్థిక సంస్థలతో అనుసంధానం చేయడం, అంతర్జాతీయ చాంబర్ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ మార్కెట్‌ను నిర్మించడం వంటి లక్ష్యాలతో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బొమ్మదేవర సుబ్బారావు, మండలి రామకృష్ణ, ఈవెంట్‌కు ఉచితంగా ఫంక్షన్ హాల్‌ను ఇచ్చిన గోపు నాగరాజేష్, కాసర్ల ఫణి వంశీ, అక్కయ్య నాయుడు, మండలి రాజేష్‌లను ఏవీ రత్నం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ ఏవీ రత్నం, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ పీవీ రావు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ పార్థసారథి, బూరగడ్డ వ్యాస్, అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్ పాల్గొన్నారు.


